
Dhvani: 7400 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనున్న భారతదేశపు కొత్త హైపర్‌సోనిక్ క్షిపణి.. బ్రహ్మోస్ కంటే భీకరం
ఈ వార్తాకథనం ఏంటి
భారత దేశం రక్షణ రంగంలో స్వయం సమృద్ధి వైపుకు అడుగులు వేస్తోంది. ఆధునిక క్షిపణి వ్యవస్థలు, ఫైటర్ జెట్లు, డ్రోన్ల వంటి ప్రాజెక్టులపై కేంద్రంగా దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో హైపర్‌సోనిక్ క్షిపణుల (Hypersonic Missiles) అభివృద్ధిని వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా, హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికల్ (HGV) 'ధ్వని' పరీక్షలను ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేయాలని భారతీయ రక్షణ పరిశోధన వ్యవస్థ (DRDO) లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఆపరేషన్ సిందూర్‌లో చర్చనీయాంశమైన బ్రహ్మోస్ కంటే ఈ క్షిపణులు మరింత ప్రభావవంతంగా, భయంకరంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
హెచ్‌జీవీ 'ధ్వని' గంటకు 7,000 కి.మీ. పైగా వేగంతో ప్రయాణించగలదు
హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికల్స్ అత్యంత వేగంగా ప్రయాణిస్తూ, సుదూర లక్ష్యాలను నిమిషాల్లోనే ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇవి శబ్ద వేగానికి ఐదు రెట్లు కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు. DRDO రూపొందిస్తున్న హెచ్‌జీవీ 'ధ్వని' గంటకు 7,000 కి.మీ. పైగా వేగంతో ప్రయాణించగలదని భావిస్తున్నారు. ఈ క్షిపణి 1,500 నుండి 2,000 కి.మీ. దూరంలోని లక్ష్యాలను నిర్ధిష్టంగా క్షేత్రహరిస్తుందని అంచనా. వేగం మాత్రమే కాక, దిశ మార్చుకునే సామర్థ్యం కలిగిన కారణంగా,శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థలకు ప్రతిస్పందనకు సరైన సమయం కూడా ఇవ్వదు అని రక్షణ నిపుణులు పేర్కొన్నారు.
వివరాలు
ఈ ఏడాది చివరి నాటికి 'ధ్వని'
హైపర్‌సోనిక్ క్రూజ్ క్షిపణుల నుండి భిన్నంగా, ఈ గ్లైడ్ వెహికల్ ప్రత్యేక నిర్మాణంలో ఉంటుంది. రాకెట్ సహాయంతో అత్యంత ఎత్తుకు చేరి, అక్కడ నుంచి విడిపోయి హైపర్‌సోనిక్ వేగంతో లక్ష్యానికి దూసుకెళ్తుంది. శత్రువుల గగనతల నిరోధక వ్యవస్థలను దాటివెళ్ళే సామర్థ్యాన్ని కలిగిన ఈ హెచ్‌జీవీ పరీక్షలను DRDO ప్రాధాన్యతతో చేపడుతోంది. ఇప్పటికే ఎయిర్‌ఫ్రేమ్ ఏరోడైనమిక్స్, థర్మల్ మేనేజిమెంట్, స్క్రామ్‌జెట్ ఇంజిన్ పనితీరు,గైడెన్స్ వ్యవస్థలకు సంబంధించిన వైమానిక,క్షేత్ర స్థాయి పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఏడాది చివరి నాటికి 'ధ్వని' హెచ్‌జీవీ పూర్తి స్థాయి పరీక్షలను DRDO నిర్వహించడానికి సిద్ధమవుతోంది.