Iran: ఇరాన్‌కు వెళ్లొద్దు.. భారతీయులకు కేంద్రం అత్యవసర హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌కు విమాన మార్గం, భూమార్గం గుండా ప్రయాణించవద్దని భారత ప్రభుత్వం తన పౌరులకు గట్టిగా సూచించింది. భారత్-ఇరాన్ మధ్య కొన్ని విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభమైనట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో గురువారం ఈ తాజా హెచ్చరిక జారీ చేసింది. తెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం విడుదల చేసిన తాజా సూచనల్లో, ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా గగనతల పరిమితులు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపింది. దీంతో ఇరాన్‌కు వెళ్లే, అక్కడి నుంచి బయలుదేరే అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇంకా సందేహ పరిస్థితుల్లోనే ఉన్నాయని పేర్కొంది.
వివరాలు
ఇండియన్స్ వచ్చేయాలని సూచన..
"భారత్-ఇరాన్ మధ్య కొన్ని విమానాలు ప్రారంభమైనట్లు సమాచారం వచ్చిన నేపథ్యంలో, గతంలో ఇచ్చిన సూచనలను కొనసాగిస్తూ భారతీయులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్‌కు ప్రయాణించవద్దు. అది విమాన మార్గం అయినా, భూ మార్గం అయినా వెళ్లొద్దు" అని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఇప్పటికే ఇరాన్‌లో ఉన్న భారతీయులు వెంటనే అక్కడి నుంచి బయటకు రావాలని సూచించింది. ఇందుకోసం రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుని నిర్ణయించిన భూ సరిహద్దు మార్గాల ద్వారా దేశం విడిచి వెళ్లాలని కోరింది.
వివరాలు
ఇరాన్‌లో 9 వేల మంది..
ప్రకారం, ఫిబ్రవరి 28న ఘర్షణలు ప్రారంభమైన సమయంలో ఇరాన్‌లో విద్యార్థులు సహా సుమారు 9,000 మంది భారతీయులు ఉన్నారు. వారిలో ఇప్పటివరకు దాదాపు 1,800 మంది భారత్‌కు తిరిగి వచ్చారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఆ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు ఉన్నతాధికారులు మరణించారు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టడంతో గల్ఫ్ ప్రాంతమంతా ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భారత రాయబార సంస్థ పోస్ట్ ఇదే..
⚠️ Advisory as on 23 April 2026. pic.twitter.com/WIPNNtFspd
— India in Iran (@India_in_Iran) April 23, 2026