
Pahalgam Attack: పాకిస్తాన్ జాతీయులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేసిన భారత్.. తక్షణమే దేశాన్ని వీడాలని ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
పహల్‌గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్థాన్‌పై గట్టిగా స్పందించింది.
ఈ పరిణామాల్లో భాగంగా,భారత ప్రభుత్వం పాకిస్థాన్ పౌరులకు ఇచ్చే వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.
మెడికల్ వీసాలు సహా,ఇప్పటికే పాక్ పౌరులకు జారీ చేసిన అన్ని రకాల వీసాలను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఈవిషయాన్నిగురువారం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.ఇప్పటికే వీసాలు పొందినవారికి ఈ నెల 27వ తేదీ వరకు గడువు విధించినట్లు స్పష్టం చేసింది.
అయితే మెడికల్ వీసాలు కలిగిన వారికి మాత్రం కొంత ఊరటనిచ్చింది.వారికీ ఈ నెల 29వ తేదీ వరకు గడువు ఇచ్చింది.
వీసా గడువు ముగిసేలోపు భారత్‌ను తప్పనిసరిగా వదిలి తమ స్వదేశాలకు వెళ్లిపోవాలంటూ కేంద్రం ఆదేశించింది.
వివరాలు
భారత పౌరులకు కీలక సూచనలు చేసిన కేంద్రం
"పాకిస్థాన్ పౌరులకు వీసా సేవలు నిలిపివేయబడ్డాయి. ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాక్ పౌరులకు జారీ చేసిన అన్ని వీసాలు రద్దు చేయబడ్డాయి. సాధారణ వీసాలు ఏప్రిల్ 27 వరకు చెల్లుబాటు అవుతాయి. మెడికల్ వీసాలు మాత్రం 29వ తేదీ వరకు మాత్రమే విలువైనవిగా పరిగణించబడతాయి. వీసా గడువు ముగిసేలోపు వారు భారతదేశాన్ని వీడాల్సి ఉంటుంది" అని ప్రకటనలో పేర్కొంది.
ఇక భారత పౌరుల విషయానికి వస్తే, కేంద్రం వారికి కూడా కీలక సూచనలు చేసింది.
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఎవరూ పాకిస్థాన్‌కి ప్రయాణించకూడదని హెచ్చరించింది.
ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న భారతీయులు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి తిరిగి భారత్‌కి రావాలని సూచించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తక్షణమే దేశాన్ని వీడాలని ఆదేశం
Pakistani nationals ordered to leave India by April 27
— Ishani K (@IshaniKrishnaa) April 24, 2025
Medical visas issued will be valid only till 29 April#Pahalgam #PahalgamTerroristAttack pic.twitter.com/XP7sbC0n2R