LOADING...
Ram Mohan Naidu : రాబోయే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలు: రామ్మోహన్ నాయుడు
రాబోయే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలు: రామ్మోహన్ నాయుడు

Ram Mohan Naidu : రాబోయే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలు: రామ్మోహన్ నాయుడు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 13, 2026
02:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా మరో 50 కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ కొత్త విమానాశ్రయాల వల్ల విమానయాన రంగమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగానికి కూడా భారీ అవకాశాలు ఏర్పడతాయని ఆయన చెప్పారు. విమానాశ్రయాలు రియల్ ఎస్టేట్ అభివృద్ధికి మౌలిక ఆధారాల్లాంటివని పేర్కొన్న మంత్రి, విమాన భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా విమానాశ్రయాల పరిసరాల్లో భవనాల ఎత్తు పరిమితుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉందని, ప్రస్తుతం దేశంలో 165 విమానాశ్రయాలు ఆపరేషన్ లో ఉన్నట్లు తెలిపారు.

వివరాలు 

ప్రతి 33 రోజులకు కొత్త విమానాశ్రయం లేదా టెర్మినల్

సగటున ప్రతి 33రోజులకు ఒక కొత్త విమానాశ్రయం లేదా కొత్త టెర్మినల్ నిర్మాణం జరుగుతోందన్నారు. జాతీయ రాజధానిలో నారెడ్కో ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ అర్బన్ అండ్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కాన్‌క్లేవ్ 2026లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ రియల్ ఎస్టేట్ రంగం 2030నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల విలువకు చేరుతుందని,2047నాటికి అది 5 నుంచి 7 ట్రిలియన్ డాలర్ల స్థాయికి పెరుగుతుందని అంచనా వేశారు. ఇళ్ల నిర్మాణంలో జీవన ప్రమాణాలతో పాటు జీవన నాణ్యతపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని,అలాచేస్తే ఆస్తుల సృష్టితో పాటు ప్రజలశ్రేయస్సు కూడా మెరుగవుతుందని అన్నారు. ముఖ్యంగా యువత అవసరాలను దృష్టిలో పెట్టుకుని అద్దెఇళ్ల ప్రాజెక్టుల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

Advertisement