
Russia Oil: అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే చమురు కొనుగోల్లు : భారత్
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలో భారత్ ఎలాంటి అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టంచేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ భారత్ అన్ని నిబంధనలను గౌరవించడం వల్లే చమరు ధరలు ఒక్కసారిగా 200 డాలర్లకు చేరకుండా ఉండాయని, కొందరు విమర్శకులు భారత్ రష్యా చమురు కోసం లాండ్రోమ్యాట్‌గా మారిందని ఆరోపిస్తున్నారని, అయితే అవి నిజానికి అసత్యమని తెలిపారు. పూరి వివరాల ప్రకారం, రష్యా నుంచి దిగుమతి చేసుకొనే చమురు ధరలు జీ-7 దేశాల విధించిన ప్రైస్ క్యాప్‌కి అనుగుణంగా ఉన్నాయి.
Details
రష్యా నుంచే చమురు కొనుగోలు
ఈ ప్రైస్ క్యాప్ ద్వారా రష్యా ఆదాయాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. భారత్ ఈ వ్యూహాన్ని ప్రపంచ చమురు ధరలను స్థిరీకరించడానికి మద్దతుగా అమలు చేస్తోంది. ప్రస్తుతానికి, భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా 37 శాతంగా ఉందని వెల్లడించారు. అమెరికా ఆంక్షలపై భయపడకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగిస్తోందని పూరి తెలిపారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య సలహాదారు ఇటీవల వ్యాఖ్యానిస్తూ, "క్రెమ్లిన్‌కు భారత్ లాండ్రోమ్యాట్ వలే పనిచేస్తోంది. ఓ వర్గం లబ్ధి పొందేందుకు భారత ప్రజలను పణంగా పెట్టడం జరుగుతోంది. ఉక్రెయిన్ వాసులను హాని చెందించడం జరుగుతోంది. మోదీ గొప్ప నేత, కానీ పుతిన్, జిన్‌పింగ్‌తో ఎందుకు అంటకావాలో నాకు అర్థం కాదు" అని పరుషంగా పేర్కొన్నారు.