LOADING...
Hormuz : హర్మూజ్‌ను తెరిచేందుకు 40దేశాల ప్రయత్నాలు.. భారత్‌కూ ఆహ్వానం
హర్మూజ్‌ను తెరిచేందుకు 40దేశాల ప్రయత్నాలు.. భారత్‌కూ ఆహ్వానం

Hormuz : హర్మూజ్‌ను తెరిచేందుకు 40దేశాల ప్రయత్నాలు.. భారత్‌కూ ఆహ్వానం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 02, 2026
09:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే హర్మూజ్ జలసంధి మళ్లీ తెరుచుకునే దిశగా అంతర్జాతీయ స్థాయిలో చురుకైన కదలికలు ప్రారంభమయ్యాయి. బ్రిటన్‌ నేతృత్వంలో ఈ అంశంపై చర్చలు జరిపేందుకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి 40కు పైగా దేశాలకు ఆహ్వానాలు పంపించగా, ఆ జాబితాలో భారత్‌ కూడా చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. భారత్‌ తరఫున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ సమావేశంలో వర్చువల్‌ విధానంలో పాల్గొననున్నారని వెల్లడించింది. హర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా ఇరాన్‌ తీసుకున్న ఈ నిర్ణయం అనేక దేశాలకు ఆర్థిక, వ్యాపార పరమైన ఇబ్బందులను తెచ్చిపెట్టింది.

వివరాలు 

ఈ కీలక సమావేశంలో పాల్గొని అమెరికా

అయితే ఈ కీలక సమావేశంలో అమెరికా పాల్గొనడం లేదని సమాచారం. ఇదిలా ఉండగా, హర్మూజ్ జలసంధిలో నౌకలు సురక్షితంగా, నిరంతరాయంగా ప్రయాణించేలా చర్యలు తీసుకునేందుకు భారత్‌ పలు దేశాలతో పాటు ఇరాన్‌తో కూడా చర్చలు కొనసాగిస్తోంది. ఈ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్‌వాల్ తెలిపారు.

Advertisement