LOADING...
Tourist Visa: ఐదేళ్ల తర్వాత చైనా పౌరులకు పర్యాటక వీసాల పునరుద్ధరణ
ఐదేళ్ల తర్వాత చైనా పౌరులకు పర్యాటక వీసాల పునరుద్ధరణ

Tourist Visa: ఐదేళ్ల తర్వాత చైనా పౌరులకు పర్యాటక వీసాల పునరుద్ధరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2026
02:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-చైనా మధ్య దౌత్య సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత అయిదేళ్లుగా చైనా పౌరులకు నిలిపివేసిన పర్యాటక వీసాలను మళ్లీ జారీ చేయాలని భారత్‌ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. గల్వాన్‌ ఘటన అనంతరం చైనా పౌరులకు పర్యాటక వీసాల జారీ నిలిచిపోయిన విషయం తెలిసిందే.

వివరాలు 

సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన కైలాస మానససరోవర్‌ యాత్ర తిరిగి ప్రారంభం 

పర్యాటక వీసాల జారీ ద్వారా పొరుగుదేశంతో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడం ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు. అధికారుల వివరాల ప్రకారం, చైనా తో పాటు హాంకాంగ్‌ పౌరులకు కూడా పర్యాటక వీసాలు మళ్లీ ఇవ్వడానికి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా గత ఏడాది నుంచే ఆంక్షలను క్రమంగా సడలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఒప్పందంతో నేరుగా విమాన సర్వీసులను పునఃప్రారంభించారు. దీర్ఘకాలంగా నిలిచిపోయిన కైలాస మానససరోవర యాత్రను కూడా తిరిగి ప్రారంభించారు.

Advertisement