Page Loader
చాబహార్ ఓడరేవు ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌కు 20,000 మెట్రిక్ టన్నుల గోధుమలను పంపనున్న భారత్
చాబహార్ ఓడరేవు ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌కు 20,000 మెట్రిక్ టన్నుల గోధుమలను పంపనున్న భారత్

చాబహార్ ఓడరేవు ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌కు 20,000 మెట్రిక్ టన్నుల గోధుమలను పంపనున్న భారత్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 08, 2023
03:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

అఫ్ఘనిస్తాన్‌కు 20,000 మెట్రిక్ టన్నుల గోధుమల్ని సరఫరా చేయబోతున్నట్లు భారత్ మంగళవారం ప్రకటించింది . ఇండియా-సెంట్రల్ ఏసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం జరిగిన వెంటనే అఫ్ఘాన్‌కు భారత్ గోధుమలు సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్యసమితి ఆహార భద్రతలో భాగంగా భారత్ ఇతర దేశాలకు ఇలా ఆహార సరఫరా చేస్తోంది. ఆగష్టు 2021లో అఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఆ దేశం తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఇండియా తాలిబన్ల పాలనను అంగీకరించనప్పటికీ, వారు కరువును ఎదుర్కుంటున్న సమయంలో భారత్ వారికీ 50,000 మెట్రిక్ టన్నుల గోధుమల్ని సరఫరా చేసింది.

గోధుమలు

ఇరాన్‌లోని చాబహర్ పోర్ట్ ద్వారా గోధుమల రవాణా

ఈసారి 20,000 మెట్రిక్ టన్నుల గోధుమల్ని సాయంగా అందించనుంది. అయితే, గతంలో పాకిస్తాన్ నుంచి గోధుమలు రవాణా చేసేది. ఇటీవల పాకిస్తాన్‌తో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో భారత్ ఈసారి ఇరాన్ నుంచి గోధుమలు రవాణా చేయబోతుంది. ఇరాన్‌లోని చాబహర్ పోర్ట్ గుండా గోధుమల్ని అఫ్ఘనిస్తాన్‌కు అందజేస్తుంది. తాలిబన్ల పాలన మొదలయ్యాక అనేక దేశాలు అక్కడి రాయబార కార్యాలయాల్ని మూసేశాయి. రాయబారుల్ని వెనక్కు రప్పించాయి. ఇండియా కూడా అదే దారిలో నడిచింది. అక్కడి రాయబార కార్యాలయాన్ని మూసేసింది. అయితే, గత ఏడాది జూన్‌లో అఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోని రాయబార కార్యాలయంలో ఒక సాంకేతిక బృందాన్ని భారత్ ఏర్పాటు చేసింది.