India: భారత్-యూఏఈ రక్షణ భాగస్వామ్యం: 2032కి 200 బిలియన్ డాలర్ల వ్యాపారం లక్ష్యం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మధ్య మెగా వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం ఏర్పాటుకు అడుగులు వేయడం మొదలుపెట్టింది. ఇదే సమయంలో, ఇరువురు దేశాలు ఎల్‌ఎన్‌జీ (LNG) సరఫరా ఒప్పందంను కూడా పూర్తి చేసుకున్నాయి. రెండు దేశాల మధ్య 2032 నాటికి 200 బిలియన్ డాలర్ల వ్యాపార లక్ష్యాన్ని చేరుకోవడం మీద దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. సోమవారం, దిల్లీలో, ప్రధాని నరేంద్ర మోదీతో UAE అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో, రెండు నేతల మధ్య కీలక అంశాలపై చర్చలు జరగాయి.
వివరాలు
అధికారుల సమక్షంలో,ఏకాంత సమావేశంలో సమగ్ర చర్చలు
సమావేశానికి ముందు,నహ్యాన్ కేవలం రెండు గంటల పర్యటన కోసం నాలుగు గంటల ప్రయాణం చేసి దిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ప్రధాని మోదీ ఆయనకు స్వాగతం పలికారు.ఇద్దరూ ఆలింగనం చేసుకున్నారు. ఒకే వాహనంలో ప్రధాని నివాసానికి వెళ్లారు.ఆ తర్వాత,అధికారుల సమక్షంలో,ఏకాంత సమావేశంలో సమగ్ర చర్చలు జరిగాయి. పాక్, సౌదీల మధ్య రక్షణ బంధం కుదిరిన నేపథ్యంలో యూఏఈతో భారత్ రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఘర్షణ, యెమెన్ సమస్యపై సౌదీ-యూఏఈల ఉద్రిక్తతలు, గాజా ప్రాంతంలో అనిశ్చిత పరిస్థితులు వంటి అంశాలు కూడా యూఏఈ అధ్యక్షుడి పర్యటనను కీలకంగా మార్చాయి. వీటి పైన, ఇరువురు దేశ నేతల మధ్య చర్చలు జరిగాయని విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి మిస్రీ తెలిపారు.