Page Loader
'భారత్' పేరు ఇష్టం లేని వాళ్లు దేశం విడిచి వెళ్లిపోండి: బీజేపీ ఎంపీ  వివాదాస్పద వ్యాఖ్యలు 
ఇష్టం లేకుంటే వెళ్లిపోండన్న దిలీప్ ఘోష్

'భారత్' పేరు ఇష్టం లేని వాళ్లు దేశం విడిచి వెళ్లిపోండి: బీజేపీ ఎంపీ  వివాదాస్పద వ్యాఖ్యలు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 10, 2023
05:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియా పేరు మార్పుపై మరోసారి రగడ మొదలైంది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా పేరును భారత్‌గా మార్చేస్తామన్నారు. ఈ క్రమంలోనే కోల్‌కతాలోని విదేశీయుల విగ్రహాలను తొలగిస్తామని బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ స్పష్టం చేశారు. అయితే పేరు మార్పును వ్యతిరేకించే వారు భారతదేశం విడిచి వెళ్లిపోవచ్చన్నారు. మేదినీపూర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఖరగ్‌పూర్ నగరంలో 'చాయ్ పే చర్చా' కార్యక్రమం నిర్వహించారు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చాక, విదేశీయుల విగ్రహాలన్నింటినీ తొలగిస్తామన్నారు. ఇండియా పేరును భారత్‌గా మార్పు చెందుతుందని, ఇష్టం లేని వారు దేశం విడిచి వెళ్లే స్వేచ్ఛ ఉందన్నారు.

DETAILS

ఇదే సరైన సమయం : రాహుల్ సిన్హా

ఒకే దేశానికి రెండు పేర్లు ఉండవని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మరో బీజేపీ సీనియర్ నాయకుడు రాహుల్ సిన్హా అన్నారు. G20 సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచ నాయకులంతా దిల్లీలోనే ఉన్నారని, ఈ మేరకు పేరు మార్చేందుకు ఇదే సరైన సమయమన్నారు. దీనిపై స్పందించిన తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శాంతను సేన్, ప్రతిపక్ష ఇండియా కూటమికి భయపడి సమస్యల నుంచి దృష్టిని మరల్చేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు. వచ్చే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున, భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలన్నీ, ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా)గా ఏర్పడ్డాయి.