LOADING...
Vidyut Vidhwans: 'విద్యుత్‌ విధ్వంస్‌' పేరుతో నార్తన్‌ కమాండ్‌ విభాగం యుద్ధ విన్యాసాలు
'విద్యుత్‌ విధ్వంస్‌' పేరుతో నార్తన్‌ కమాండ్‌ విభాగం యుద్ధ విన్యాసాలు

Vidyut Vidhwans: 'విద్యుత్‌ విధ్వంస్‌' పేరుతో నార్తన్‌ కమాండ్‌ విభాగం యుద్ధ విన్యాసాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2025
01:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత సైన్యంలోని నార్తర్న్ కమాండ్ మంగళవారం 'విద్యుత్ విధ్వంస్' (Vidyut Vidhwans) పేరుతో విస్తృత స్థాయి యుద్ధ విన్యాసాలను నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ స్వయంగా పర్యవేక్షించారు. ఇందులో భాగంగా భారత నెట్‌వర్క్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని నెట్‌వర్క్‌-కేంద్రీకృత యుద్ధ కార్యకలాపాల సామర్థ్యాలను పరీక్షించారు. ఈ విన్యాసాల ద్వారా సైన్యం తన అత్యాధునిక సాంకేతిక సామర్థ్యాలను ప్రదర్శించింది. భవిష్యత్తులో యుద్ధాల స్వరూపం పూర్తిగా మారబోతోందని అధికారులు పేర్కొన్నారు. ఆయుధ శక్తితో పాటు సైబర్ యుద్ధాలు, సాంకేతిక ఆధారిత దాడులు, మానవరహిత వైమానిక వాహనాలు (UAVs), ఉపగ్రహ నిఘా, ఆర్థిక వ్యవస్థలు, దౌత్య వ్యూహాలు వంటి అంశాలు కూడా కీలక ఆయుధాలుగా మారనున్నాయని చెప్పారు.

వివరాలు 

'విద్యుత్ విధ్వంస్' విన్యాసాల్లో సైన్యం,నావికాదళం,వైమానిక దళం

అందుకే భారత సైన్యం ఇప్పుడు బహుళ-డొమైన్ కార్యకలాపాలపై దృష్టి సారించింది. అంతరిక్షం, సైబర్ రంగాలు వంటి ఆధునిక యుద్ధ వేదికలను ఎదుర్కొనేందుకు సైన్యం తన శక్తిని, సన్నద్ధతను పెంచుకుంటోందని వివరించారు. లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ మాట్లాడుతూ,తాజాగా నిర్వహించిన ఈ నెట్‌వర్క్-కేంద్రీకృత విన్యాసాలు (Network-Centric Operations)ఆధునిక యుద్ధాలకు భారత్ సిద్ధంగా ఉన్నదని స్పష్టంగా చూపుతున్నాయని అన్నారు. 'విద్యుత్ విధ్వంస్' విన్యాసాల్లో సైన్యం,నావికాదళం,వైమానిక దళం..ఈ మూడు దళాలు కలిసి పాల్గొన్నాయని తెలిపారు. ఈ విన్యాసాలు త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. అలాగే భారత సైన్యంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం,రక్షణ వ్యవస్థల ఆధునికీకరణ,ఆయుధ శక్తిని పెంపొందించడం,దేశీయ సాంకేతిక స్వావలంబనను బలోపేతం చేయడం వంటి లక్ష్యాలతో ఈ విన్యాసాలు చేపట్టినట్లు ఆయన వివరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'విద్యుత్‌ విధ్వంస్‌' పేరుతో నార్తన్‌ కమాండ్‌ విభాగం యుద్ధ విన్యాసాలు