India- Pakistan: J&Kలోని నియంత్రణ రేఖ సమీపంలో పాకిస్థానీ క్వాడ్‌కాప్టర్లపై భారత సైన్యం కాల్పులు
జమ్ముకశ్మీర్ లోని పూంచ్‌లోని నియంత్రణ రేఖ(ఎల్‌ఓసి)వెంబడి రెండు వేర్వేరు ప్రదేశాల్లో కనిపించిన పాకిస్థాన్ క్వాడ్‌కాప్టర్లపై భారత సైన్యం శుక్రవారం కాల్పులు జరిపింది. అయితే,బాల్నోయి-మెంధార్,గుల్పూర్ సెక్టార్లలో భారత్ భూభాగం పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్లు ఎగిరిన తరువాత మళ్ళీ తిరిగి వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. క్వాడ్‌కాప్టర్ల ద్వారా వస్తువులు, ఆయుధాలు లేదా మాదక ద్రవ్యాలు కింద పడకుండా చూసేందుకు భారత సైన్యం వెంటనే రెండు విభాగాలలో శోధన ఆపరేషన్‌ను ప్రారంభించిందని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మొదటి సంఘటన ఉదయం 6.30 గంటలకు మెంధార్‌లోని బాల్నోయ్ ప్రాంతంలో జరిగింది. అదేవిధంగా, అదే సమయంలో గుల్పూర్ సెక్టార్‌పై రెండు క్వాడ్‌కాప్టర్‌లు సంచరించడం గమనించిన భారత సైనికుల కాల్పులను ఎదుర్కొని తిరిగి వచ్చినట్లు తెలిపారు.
పాకిస్థాన్ డ్రోన్ లపై సమాచారం అందించిన వారికీ నగదు బహుమతి
అయితే, అంతకుముందు, ఫిబ్రవరి 12 న, మెంధార్ సెక్టార్‌లోని మాన్‌కోట్ ప్రాంతంలో శత్రు డ్రోన్ కదలికను గుర్తించిన ఆర్మీ దళాలు దానిపై కాల్పులు చేసినట్లు పేర్కొన్నాయి. జమ్ముకశ్మీర్ లోకి మాదక ద్రవ్యాలు, ఆయుధాలను రవాణా చేయడానికి పాకిస్తాన్ డ్రోన్‌లను ఉపయోగిస్తోంది. దీంతో అలెర్ట్ అయ్యిన ,జమ్ముకశ్మీర్ పోలీసులు పాకిస్థాన్ నుంచి ఆయుధాలు,మాదకద్రవ్యాలను జారవిడిచేందుకు సరిహద్దు దాటే డ్రోన్‌ల గురించిన సమాచారం అందించిన వారికి 3 లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తామని ప్రకటించారు.