
Rakesh Pal: గుండెపోటుతో భారత కోస్ట్ గార్డ్ డీజీ రాకేశ్ పాల్ మృతి
ఈ వార్తాకథనం ఏంటి
భారత కోస్ట్ గార్డ్ డైరక్టర్ జనరల్ రాకేశ్ పాల్ (59) తుదిశ్వాస విడిచారు. గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
కోస్ట్‌గార్డ్ సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి వచ్చారు. తీవ్ర ఆసౌకర్యానికి గురైన చైన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు.
ఈ క్రమంలో చికిత్స పొందుతూ రాకేశ్ పాల్ మృతి చెందారు. రాకేశ్ పాల్ మరణవార్త తెలుసుకున్న రాజ్‌నాథ్ సింగ్, ఆస్పత్రికి చేరుకొని పాల్‌కు నివాళులర్పించారు.
ఇక ఆయన పార్థివదేహాన్ని దిల్లీకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
Details
34 ఏళ్ల పాటు దేశానికి సేవలందించిన రాకేశ్ పాల్
రాకేశ్ పాల్ 34 ఏళ్ల పాటు దేశానికి సేవలందించారు.
సమర్థ్, విజిత్, సుచేత కృపలానీ, అహల్యాబాయి, సీ-03 తదితర భారత కోస్ట్‌గార్డ్ నౌకలకు ఆయన నేతృత్వం వహించారు.
ఆయన పర్యవేక్షణలో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు, రూ. కోట్లు విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.
గతేడాది జులై 19న ఐసీజీ 25వ డైరక్టర్ జనరల్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు.