LOADING...
Ireland: డబ్లిన్‌లో దాడులపై భారత ఎంబసీ హెచ్చరిక.. భారతీయులు అప్రమత్తంగా ఉండండి
డబ్లిన్‌లో దాడులపై భారత ఎంబసీ హెచ్చరిక.. భారతీయులు అప్రమత్తంగా ఉండండి

Ireland: డబ్లిన్‌లో దాడులపై భారత ఎంబసీ హెచ్చరిక.. భారతీయులు అప్రమత్తంగా ఉండండి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2025
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐర్లాండ్‌లో భారతీయులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఆ దేశ రాజధాని డబ్లిన్‌ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది. ఇటీవల జాతి వివక్ష నేపథ్యంలో భారతీయులపై దాడులు నమోదవుతున్నాయని పేర్కొంటూ, వారు నిర్జన ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ దాడులు ముఖ్యంగా రాత్రి సమయంలో, జనసాంద్రత లేని ప్రాంతాల్లో జరుగుతున్నాయని గుర్తించడంతో, అక్కడ నివసించే భారతీయులు తమ స్వస్థలాలకు సమీపంగా ఉండాలని పేర్కొంది.

Details

భారత పౌరులంతా అప్రమత్తంగా ఉండాలి

ప్రస్తుతం పరిస్థితిని పరిశీలిస్తూ, ఐర్లాండ్‌ ప్రభుత్వ సంబంధిత విభాగాలతో సంప్రదింపులు కొనసాగుతున్నట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. భద్రత పరంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని అక్కడి భారతీయులకు హితవు పలికిన రాయబార కార్యాలయం, ఎలాంటి అనుమానాస్పద లేదా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే తమతో సంప్రదించాలని కోరింది. దాడులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత్‌ పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.