LOADING...
Times Square: న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో బాలీవుడ్‌ స్టైల్లో.. ప్రియురాలికి ప్రపోజ్ 
న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో బాలీవుడ్‌ స్టైల్లో.. ప్రియురాలికి ప్రపోజ్

Times Square: న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో బాలీవుడ్‌ స్టైల్లో.. ప్రియురాలికి ప్రపోజ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 01, 2025
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒక భారతీయ యువకుడు తన ప్రేమను వినూత్నంగా వ్యక్తం చేస్తూ ప్రియురాలికి ప్రత్యేకంగా ప్రపోజ్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రియురాలి కళ్లకు గంతలు కట్టి ఆమె స్నేహితులు టైమ్స్‌ స్క్వేర్‌కు తీసుకొచ్చిన తర్వాత.. బాలీవుడ్‌ సినిమా తరహాలో డ్యాన్స్‌ సెటప్‌తో ఆమె ముందుకు వచ్చి ప్రేమను వెల్లడించాడు. ఈ రొమాంటిక్‌ ఘటనకు వేదికగా నిలిచింది అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌.

వివరాలు 

భావోద్వేగానికి లోనైన  శ్రేయ 

అమెరికాలో నివసిస్తున్న పార్థ్‌ మానియార్‌ తన ప్రియురాలు శ్రేయా సింగ్‌కు ఇలా వినూత్నంగా ప్రపోజ్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అవుతోంది. వీడియోలో పార్థ్‌ తన స్నేహితులతో కలిసి టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద డ్యాన్స్‌ చేస్తూ ప్రేమను తెలియజేస్తాడు. కొద్ది సేపటికే అక్కడికి వచ్చిన అతడి కుటుంబ సభ్యులు కూడా ఈ డ్యాన్స్‌లో పాల్గొని సంబరాన్ని మరింత పెంచారు. ఈ ఏర్పాట్లు చూసి శ్రేయ భావోద్వేగానికి లోనైంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు.. ఇది ఓ బాలీవుడ్‌ సినిమా సీన్‌లా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే.. 

Advertisement