
Operation Sindoor: నేటి ఉదయం 10 గంటలకు భారత మిలిటరీ అత్యవసర మీడియా సమావేశం...
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ పాకిస్థాన్‌పై తీవ్రమైన ప్రతీకార చర్యలు చేపట్టింది.గత రెండు రోజులుగా పాకిస్తాన్ చేపట్టిన డ్రోన్ దాడులకు ప్రతిస్పందనగా,భారత్ పాకిస్తాన్‌లోని పలు ప్రధాన నగరాల్లో ఉన్న ఎయిర్ బేస్‌లపై భారీ స్థాయిలో దాడులు జరిపింది.
ఈ దాడుల్లో పాకిస్తాన్ మిలిటరీ ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండిని లక్ష్యంగా తీసుకుంది.
అక్కడ ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌ను పూర్తిగా ధ్వంసం చేసింది.ఇంతకుముందు కూడా భారత్ రఫికీ ఎయిర్ బేస్,మురిద్ ఎయిర్ బేస్‌లపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపింది.
తాజా సమాచారం ప్రకారం, పాకిస్తాన్‌లోని అన్ని ముఖ్యమైన ఎయిర్ బేస్‌లు ఈ దాడుల్లో నాశనమయ్యినట్లు తెలుస్తోంది.
లాహోర్, ఇస్లామాబాద్, సియాల్‌కోట్ వంటి ప్రధాన నగరాల్లో కూడా ఈ దాడులు సాగినట్టు వార్తలు వెలువడ్డాయి.
వివరాలు
ఇండియన్ మిలిటరీ ప్రత్యేక మీడియా సమావేశం
ఇక మరోవైపు, ఈ ఉదయం 10.30 గంటల సమయంలో ఇండియన్ మిలిటరీ ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయ, రక్షణ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ సమావేశంలో పాకిస్తాన్‌లో జరిగిన విధ్వంసంపై పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా, సౌత్ బ్లాక్‌లో ఈ మీడియా సమావేశం జరగనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇండియన్ మిలిటరీ ప్రత్యేక మీడియా సమావేశం
MEA (Ministry of External Affairs) and MoD (Ministry of Defence) briefing to be held at 10:30 am today.
— ANI (@ANI) May 10, 2025