CAA ని నిషేధించాలని సుప్రీంకోర్టులో పిటీషన్
కేంద్ర ప్రభుత్వం మార్చి 11న దేశవ్యాప్తంగా పౌరసత్వ (సవరణ) చట్టం, 2019 (CAA)ని అమలు చేసింది. ఈ క్రమంలో కేరళలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) అనే రాజకీయ పార్టీ CAAని నిషేధించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పౌరసత్వ సవరణ చట్టం మతం ఆధారంగా ముస్లింలపై వివక్ష చూపుతుందని పిటిషన్‌లో పేర్కొంది. CAAని డిసెంబర్ 11, 2019న పార్లమెంట్ ఆమోదించింది. మరుసటి రోజు ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించి.. చట్టంగా మారింది. అదే రోజు, సీఏఏను సవాల్ చేస్తూ.. ఐయూఎంఎల్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ చట్టం ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ హక్కును ఉల్లంఘిస్తుందని పిటిషనర్లు పేర్కొన్నారు.