Loading...
Indian Railways: అక్టోబర్ 10న ఢిల్లీకి వచ్చే పలు రైళ్లు రద్దు.. కారణమిదే!
అక్టోబర్ 10న ఢిల్లీకి వచ్చే పలు రైళ్లు రద్దు.. కారణమిదే!

Indian Railways: అక్టోబర్ 10న ఢిల్లీకి వచ్చే పలు రైళ్లు రద్దు.. కారణమిదే!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2026
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో అక్టోబర్ 10న రైలు ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని భావించిన రైల్వే శాఖ.. పలు మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. శనివారం ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఈ రెండు స్టేషన్లకు చేరుకోవాల్సిన రైళ్లపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.

వివరాలు 

ఉత్తర్వులు జారీ చేసిన రైల్వే శాఖ కోచింగ్ డైరెక్టరేట్

అక్టోబర్ 9న రైల్వే శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత తమ ప్రయాణాన్ని ప్రారంభించి, శనివారం ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ లేదా హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు చేరుకోవాల్సిన అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను వాటి ప్రారంభ స్టేషన్ల నుంచే రద్దు చేయనున్నారు.

అంటే ఆయా రైళ్లు మార్గమధ్యంలో రద్దు కాకుండా, ప్రయాణం మొదలయ్యే స్టేషన్‌ నుంచే రద్దవుతాయి.

ఈ నిర్ణయానికి సంబంధించి రైల్వే శాఖ కోచింగ్ డైరెక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది.

రెండు రైల్వే స్టేషన్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడవచ్చన్న అంచనాతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

వివరాలు 

రైళ్ల రద్దుకు ఆ నిరసనలే కారణమా?

మరోవైపు, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

అయితే, రైళ్ల రద్దుకు ఆ నిరసనలే కారణమా? అనే విషయాన్ని రైల్వే అధికారులు అధికారికంగా ధ్రువీకరించలేదు.

కాబట్టి ప్రయాణికులు తమ రైళ్ల రాకపోకల వివరాలను ముందుగానే తెలుసుకుని ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

న్యూఢిల్లీ, నిజాముద్దీన్ స్టేషన్లకు వెళ్లే ప్రయాణికులకు కీలక సమాచారం

ADVERTISEMENT