LOADING...
Indian Railways: హైదరాబాద్‌ నుంచి ఎనిమిది కొత్త రైళ్లు.. రైల్వే అధికారుల వెల్లడి
హైదరాబాద్‌ నుంచి ఎనిమిది కొత్త రైళ్లు.. రైల్వే అధికారుల వెల్లడి

Indian Railways: హైదరాబాద్‌ నుంచి ఎనిమిది కొత్త రైళ్లు.. రైల్వే అధికారుల వెల్లడి

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 22, 2026
08:49 am

ఈ వార్తాకథనం ఏంటి

రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని పలు స్టేషన్ల నుంచి ఎనిమిది కొత్త రైళ్లను ప్రకటించింది. కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, తిరుచానూరు, అలాగే రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌, జైపూర్‌, ఒడిశాలోని భువనేశ్వర్‌ ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలియజేశారు. ఈ కొత్త రైళ్లలో ముఖ్యంగా తిరుపతి, తిరుచానూరు వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం ఐదు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో భక్తులకు ప్రయాణం మరింత సులభం కానుంది. అదే సమయంలో భువనేశ్వర్‌, జైపూర్‌, శ్రీగంగానగర్‌ వంటి దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా ఈ నిర్ణయం వల్ల భారీ ప్రయోజనం కలగనుంది.

వివరాలు 

ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారం ఉండదు: రైల్వే శాఖ

రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే ఈ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తున్నప్పటికీ, వాటిని సాధారణ రైళ్లుగా మార్చాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు సాధారణ రైళ్లుగా మారడం వల్ల ప్రయాణికులపై అదనపు ఛార్జీల భారం ఉండదని కూడా స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన ట్వీట్ 

Advertisement