Merchant Navy Sailor: నడిసముద్రంలో కనిపించడకుండా పోయిన భారత నావికుడు
వాణిజ్య నౌకలో విధుల్లో ఉన్న ఒక నావికుడు కనిపించకుండా పోయాడు. తుర్కియే లోని నౌకాశ్రయానికి వెళ్లే మార్గంలో నౌక నుంచి అదృశ్యమయ్యారు. ఈ మిస్సింగ్ తో అతడి కుటుంబ సభ్యులను ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఉత్తరాఖండ్‌కు చెందిన అంకిత్ సక్లానీ ముంబయి సంస్థ ఎల్విన్ షిప్ మేనేజ్ మెంట్ లో నావికుడిగా పనిచేస్తున్నాడు. డిసెంబర్ 1 విధుల్లో చేరిన అంకిత్ సక్లానీ, డిసెంబర్ 18 నుంచి కనిపించకుండా పోయాడని అతని భార్య మీడియాకు తెలిపింది. తన భర్తకు నావికుడిగా 15 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పారు.
ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించిన నావికుడి కుటుంబం
తుర్కియే చేరుకోవడానికి ముందే తన భర్త నౌక నుంచి సముద్రంలోకి దూకేశాడని డిసెంబర్ 18న సంస్థ నుంచి కాల్ వచ్చిందన్నారు. అయితే ఇంతకుముందు తన భర్త కోసం గాలిస్తున్నట్లు చెప్పిన సంస్థ, ఇప్పుడు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ, సక్లానీ కుటుంబ సభ్యులు ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. దీనిపై నావికుడి కుటుంబ సభ్యులు తుర్కియే ఎంబసీకి లేఖ కూడా రాశారు.