Visa Free Entry: భారతీయ పర్యాటకులకు వీసా ఎంట్రీని ప్రకటించిన ఇరాన్ .. షరతులు ఏంటంటే?
భారతీయ పర్యాటకులు వీసా లేకుండానే తమ దేశంలో 15 రోజుల పాటు ఉండొచ్చని ఇరాన్ మంగళవారం తెలిపింది. నాలుగు షరతులకు లోబడి ఫిబ్రవరి 4 నుండి వీసా రహిత ప్రవేశం భారతీయ పౌరులకు అందుబాటులోకి వచ్చినట్లు ఇరాన్ రాయబార కార్యాలయం తెలిపింది. డిసెంబరులో,ఇరాన్ భారతదేశం,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, జపాన్, సింగపూర్, మలేషియాతో సహా 32 ఇతర దేశాల కోసం కొత్త వీసా-రహిత ప్రోగ్రామ్‌ను ఆమోదించింది. సాధారణ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న వ్యక్తులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వీసా లేకుండా దేశంలోకి ప్రవేశించడానికి అనుమతించబడతారని, గరిష్టంగా 15 రోజులు ఉండవచ్చని ఇరాన్ రీడౌట్ తెలిపింది.
వీసా లేకుండానే ఇరాన్ లో 15రోజుల పాటు ఉండచ్చు..
ఈ గడువు ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని స్పష్టం చేసింది. పర్యాటక ప్రయోజనాల కోసం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ భూభాగంలోకి ప్రవేశించే వ్యక్తులకు మాత్రమే వీసా రద్దు వర్తిస్తుందని పేర్కొంది. భారతీయ పర్యాటకులు వీసా లేకుండానే తమ దేశంలో 15రోజుల పాటు ఉండొచ్చని,విమాన మార్గంలో వచ్చే ప్రయాణికులకు మాత్రమే ఈ వీసా ఫ్రీ ఎంట్రీ వర్తిస్తుందని వెల్లడించింది. కేవలం పర్యాటకం కోసం వచ్చినవారికి మాత్రమే వీసా ఎత్తివేత అమలవుతుందని తెలిపింది. ఆరు నెలలకోసారి మాత్రమే ఈ వీసా రహిత టూర్‌లకు అనుమతిస్తామని పేర్కొంది. గత నెలలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇరాన్ వెళ్లారు.ఈ సందర్భంగా ఆయన ఇరాన్ కౌంటర్ హోస్సేన్ అమీర్-అబ్డోల్లాహియాన్‌తో ద్వైపాక్షిక, ప్రాంతీయ సమస్యలపై విస్తృత చర్చలు జరిపారు.