Vayu Astra: స్వదేశీ డ్రోన్ 'వాయుఅస్త్ర' ప్రయోగం విజయవంతం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ స్వదేశీ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగులు వేస్తోంది. తాజాగా ప్రైవేట్ రంగానికి చెందిన రక్షణ సంస్థ నిబే లిమిటెడ్ అభివృద్ధి చేసిన 'వాయుఅస్త్ర' ఆత్మాహుతి డ్రోన్ పరీక్షలు విజయవంతమయ్యాయి. ఈ పరీక్షలను గత నెల 18, 19 తేదీల్లో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో,అనంతరం 26, 27 తేదీల్లో ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ ప్రాంతంలో నిర్వహించినట్లు సంస్థ వెల్లడించింది. లాయిటరింగ్ మ్యూనిషన్‌గా పిలిచే ఈ ఆత్మాహుతి డ్రోన్లు మానవరహిత వైమానిక ఆయుధాలుగా పనిచేస్తాయి. ఇవి గాల్లో నిరంతరం సంచరిస్తూ లక్ష్యాన్ని గుర్తించిన వెంటనే దానిపై దాడి చేస్తాయి. పోఖ్రాన్‌లో జరిగిన తొలి పరీక్షలో 'వాయుఅస్త్ర-1' దాదాపు 10 కిలోల పేలుడు సామగ్రిని మోసుకెళ్లినట్లు నిబే లిమిటెడ్ తెలిపింది.
వివరాలు
ఇజ్రాయెల్ సాంకేతికత ఆధారంగా ఈ వ్యవస్థ రూపొందింది
తొలి ప్రయత్నంలోనే సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించినట్లు వెల్లడించింది. ఈ డ్రోన్‌కు లక్ష్యంపై దాడి చేసే సమయంలో మధ్యలోనే ఆపివేయడం, అవసరమైతే మళ్లీ తిరిగి దాడి చేయడం వంటి ప్రత్యేక సామర్థ్యాలు కూడా ఉన్నాయని సంస్థ పేర్కొంది. ఇజ్రాయెల్ సాంకేతికత ఆధారంగా ఈ వ్యవస్థను రూపొందించినట్లు వెల్లడించింది. రాత్రి సమయంలో నిర్వహించిన పరీక్షల్లో ఇన్‌ఫ్రారెడ్ కెమెరా సహాయంతో లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన మరో పరీక్షలో 'వాయుఅస్త్ర-1' 90 నిమిషాలకుపైగా గాల్లోనే సంచరిస్తూ, 14 వేల అడుగులకుపైగా ఎత్తులో ఉన్న లక్ష్యాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
'వాయుఅస్త్ర' ప్రయోగం విజయవంతం
#WATCH | Nibe Group says - Nibe Group has successfully completed the no-cost, no-commitment demonstration of its loitering munition named Vayu Astra with 100 KM Range at Pokhran on 18-19 April 2026 & Joshimath (Malari), Uttarakhand on 26-27 April 2026.
— ANI (@ANI) May 21, 2026
Nibe Limited’s Vayu… pic.twitter.com/2jICaZoZ4x