LOADING...
Shamshabad: డాలస్‌ ప్రయాణికులను వదిలేసి వెళ్లిపోయిన ఇండిగో విమానం
డాలస్‌ ప్రయాణికులను వదిలేసి వెళ్లిపోయిన ఇండిగో విమానం

Shamshabad: డాలస్‌ ప్రయాణికులను వదిలేసి వెళ్లిపోయిన ఇండిగో విమానం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2025
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ నిర్లక్ష్యంతో హైదరాబాద్‌ నుంచి డాలస్‌ వెళ్లాల్సిన పలువురు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే- డాలస్‌కు వెళ్ళాలనుకున్న 38 మంది ప్రయాణికులు టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ వెబ్‌సైట్‌ సూచన మేరకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో టై-అప్‌ ఉన్న టికెట్లను ఆన్‌లైన్‌లో ఒక్కొక్కరు రూ.2 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. వారి ప్రయాణ ప్రణాళిక ప్రకారం, శనివారం రాత్రి 11.40 గంటలకు శంషాబాద్‌ నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ 6ఇ-5195 విమానంలో ముంబయి చేరుకుని, అక్కడి నుంచి టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌లో డాలస్‌కు వెళ్లాల్సి ఉంది.

Details

మిగిలిన ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే

అయితే ప్రయాణికుల ఆరోపణల ప్రకారం, ఓవర్‌బుకింగ్‌ పేరుతో ఇండిగో ప్రతినిధులు చివరి నిమిషంలో సర్వీస్‌ నంబరును 6ఇ-6132గా మార్చారు. ఆ విమానంలో 38 మందిలో కేవలం 24 మందినే ముంబయికి పంపించి, మిగతావారిని విమానాశ్రయంలోనే వదిలేశారు. ఈ ఘటనపై స్పష్టత కోరినప్పుడు ఇండిగో ప్రతినిధులు పొంతనలేని సమాధానాలు ఇచ్చారని బాధితులు తెలిపారు. దీంతో మిగిలిన ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, దాదాపు ఏడు గంటలపాటు విమానాశ్రయంలోనే నిరీక్షించారు. ఎట్టకేలకు మరో మార్గం లేక వెనుదిరిగారు. ఈ సంఘటనపై జీఎమ్మార్‌ విమానాశ్రయ ప్రతినిధులను సంప్రదించగా, ఈ విషయం తమ దృష్టికి రాలేదని స్పందించారు.