Page Loader
వంతెనపై నుంచి లోయలో పడిపోయిన బస్సు; 15 మంది మృతి 
ఇండోర్: వంతెనపై నుంచి లోయలో పడిపోయిన బస్సు; 15 మంది మృతి

వంతెనపై నుంచి లోయలో పడిపోయిన బస్సు; 15 మంది మృతి 

వ్రాసిన వారు Stalin
May 09, 2023
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్తున్న బస్సు మంగళవారం ఖర్గోన్‌లో వంతెనపై నుంచి లోయలోకి పడిపోవడంతో 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. దాదాపు 25మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఇండోర్‌కు వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి అదుపు తప్పి లోయలోకి పడిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన ఆ ప్రాంతంలోని స్థానికులు వెంటనే సహాయక చర్యలను ప్రారంభించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేలు, క్షతగాత్రులకు రూ.25 వేలు అందిజేస్తామని వెల్లడించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రమాదంలో 25మందికి గాయాలు