LOADING...
kethepally : మూసీకి పెరుగుతున్న వరద.. 492.24 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
మూసీకి పెరుగుతున్న వరద.. 492.24 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

kethepally : మూసీకి పెరుగుతున్న వరద.. 492.24 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
04:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

మూసీ ప్రాజెక్ట్‌కు శుక్రవారం నాడు ఎగువ ప్రాంతాల నుంచి 492.24 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు (సుమారు 4.46 టీఎంసీలు) కాగా,ప్రస్తుతానికి ఇది 640.85 అడుగులకు (సుమారు 3.41 టీఎంసీలు) చేరుకుంది. గత నెల రోజులుగా హైదరాబాద్‌,జనగామ‌, వరంగల్‌ తదితర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో,ఈ ప్రాజెక్ట్‌కు రోజూ 400 క్యూసెక్కులకుపైగా నీటి ఇన్‌ఫ్లో స్థిరంగా కొనసాగుతోంది.

వివరాలు 

కాల్వ‌ల ద్వారా నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ 

ఏప్రిల్‌ నెలలో కుడి, ఎడమ కాల్వ‌లకు నీటి విడుదల నిలిపినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 17 అడుగుల మేర ప్రాజెక్ట్‌లో నీటిమట్టం పెరిగింది. ఇన్‌ఫ్లో ఇదే స్థాయిలో కొనసాగితే, ఈ నెల ముగిసే నాటికి నీటిమట్టం 640 అడుగులకు చేరుకునే అవకాశముందని అంచనా వేస్తున్నారు. వానాకాలం సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో ప్రాజెక్ట్‌లో నీటి మట్టం పెరుగుతుండటంతో, రైతులు కాల్వ‌ల ద్వారా నీటిని విడుదల చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.