LOADING...
Pak spy: పాక్‌కు సమాచారం లీక్‌.. రాజస్థాన్‌లో వ్యక్తి ఆరెస్టు
పాక్‌కు సమాచారం లీక్‌.. రాజస్థాన్‌లో వ్యక్తి ఆరెస్టు

Pak spy: పాక్‌కు సమాచారం లీక్‌.. రాజస్థాన్‌లో వ్యక్తి ఆరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 25, 2025
08:35 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌కు చెందిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న గూఢచారులను అధికారులు గుర్తించి వరుసగా అరెస్టు చేస్తున్నారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలోని డీగ్ ప్రాంతానికి చెందిన ఖాసిం అనే 32ఏళ్ల వ్యక్తిని పోలీసులు పాక్‌కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. అధికారుల ప్రకారం, ఇటీవల చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' సమయంలో ఖాసిం పాకిస్థాన్‌లోని వ్యక్తులతో ఫోన్‌లో మాట్లాడిన విషయం వెలుగులోకొచ్చింది. అంతేకాకుండా అతడు పాక్‌కి ప్రయాణించినట్లు సమాచారం ఉంది.

Details

దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు

ఖాసింకు సంబంధించిన మొబైల్ ఫోన్‌ను ఇప్పటికే ఫోరెన్సిక్ పరీక్షకు పంపించి, దర్యాప్తు కొనసాగుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై ఇప్పటివరకు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 10 మందికి పైగా వ్యక్తులను అధికారులు అరెస్టు చేశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్టు సమాచారం.