LOADING...
AP Inter Exams: ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు.. కీలక మార్పులు చేసిన విద్యాశాఖ
ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు.. కీలక మార్పులు చేసిన విద్యాశాఖ

AP Inter Exams: ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు.. కీలక మార్పులు చేసిన విద్యాశాఖ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 31, 2025
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై ఈసారి ఇంటర్మీడియట్ విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే విద్యాసంవత్సరానికి సంబంధించిన ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరిలోనే నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. గతంలో ఈ పరీక్షలు మార్చిలో జరిగేవి. అయితే ఈసారి మాత్రం సీబీఎస్‌ఈ విధానానికి అనుగుణంగా ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.

Details

 పరీక్షల విధానంలో మార్పులు 

సైన్స్‌ విద్యార్థుల పరీక్షలు ముందుగా ప్రారంభమవుతాయి. ఒకే రోజున ఒక్క సబ్జెక్టుకు మాత్రమే పరీక్ష ఉంటుంది. గతంలో ఎంపీసీకి ఒక సబ్జెక్టు పరీక్ష ఉన్న రోజునే బైపీసీ, ఆర్ట్స్‌ విద్యార్థులకు వేరే సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించేవారు. ఇకపై ఒక రోజు ఒకే సబ్జెక్టుకు మాత్రమే పరీక్ష ఉంటుంది. సైన్స్‌ గ్రూప్ సబ్జెక్టులు పూర్తయ్యాక చివరిలో భాషా పేపర్లు ఉంటాయి. ఆర్ట్స్‌ గ్రూపు విద్యార్థుల పరీక్షలు తరువాత ప్రారంభమవుతాయి.

Details

ప్రాక్టికల్స్‌పై ఇంకా స్పష్టత లేదు

ప్రాక్టికల్ పరీక్షల విషయంలో మాత్రం ఇంకా నిర్ణయం వెలువడలేదు. జనవరి చివరిలో నిర్వహించాలా? లేక రాతపరీక్షల తర్వాత నిర్వహించాలా? అనే విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రథమ సంవత్సరంలో కొత్త మార్పులు ఎన్‌సీఈఆర్టీ సిలబస్ పూర్తిగా అమలులోకి తీసుకొచ్చారు. ప్రశ్నపత్రాల విధానంలో కూడా మార్పులు చేశారు. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రం పేపర్లను 85 మార్కులకే నిర్వహిస్తారు. మిగిలిన మార్కులు రెండో సంవత్సరం ప్రాక్టికల్స్ ద్వారా ఇవ్వబడతాయి. అన్ని పేపర్లలో కూడా ఈ ఏడాది నుంచి ఒక్క మార్కు ప్రశ్నలు కొత్తగా ప్రవేశపెట్టారు.