Page Loader
Hyderabad: ఉచిత శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానం 
Hyderabad: ఉచిత శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానం

Hyderabad: ఉచిత శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానం 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 29, 2024
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్(BIRED)గ్రామీణ/పట్టణ నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ సంస్థ స్వయం ఉపాధి కోసం సాంకేతిక కోర్సులలో ఉచిత శిక్షణను అందిస్తుంది.మే 20 నుంచి జూన్ 26 వరకు 38 రోజుల పాటు ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్నినిర్వహిస్తోంది. 19-30 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులు.ఇది హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ప్రాంగణంలో అందించబడుతుంది. శిక్షణా కోర్సులలో MS-ఆఫీస్(ఇంటర్మీడియట్, అంతకంటే ఎక్కువ ఉత్తీర్ణులైన వారికి),PC హార్డ్‌వేర్, ల్యాప్‌టాప్ సర్వీసింగ్(ఇంటర్మీడియట్,అంతకంటే ఎక్కువ)ఎలక్ట్రీషియన్ మోటార్ వైండింగ్ రిపేరింగ్ ఉన్నాయి. శిక్షణ సమయంలో బోర్డింగ్,ల్యాబొరేటరీ సహా సౌకర్యాలు ఉచితంగా అందించబడతాయి. దరఖాస్తులు మే 18 వరకు స్వీకరించబడతాయి. మరింత సమాచారం కోసం https://bired.org/