Page Loader
శభాష్.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కు సీఎం వైఎస్ జగన్ అభినందనలు 
ఏపీ సీఎంను కలిసిన అంబటి రాయుడు

శభాష్.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కు సీఎం వైఎస్ జగన్ అభినందనలు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 08, 2023
07:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ భారత క్రికెటర్ అంబటి రాయుడు గురువారం కలిశారు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి క్యాంపు ఆఫీసులో ప్రముఖ ఐపీఎల్ జట్టు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం, క్రికెటర్‌ అంబటి రాయుడు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చెన్నై సూపర్‌ కింగ్స్ టీమ్ గెలుచుకున్న ట్రోఫీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అంబటి రాయుడుతో కలిసి సీఎస్‌కే ఫ్రాంచైజీ ఓనర్‌ ఎన్‌.శ్రీనివాసన్‌ కుమార్తె రూపా గురునాథ్ చూపించారు.

Details

క్రీడారంగం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : సీఎం జగన్

అయితే సీఎస్‌కే జట్టు సభ్యులందరి ఆటోగ్రాఫ్‌తో కూడిన ఓ జెర్సీని సీఎం జగన్ కు బహుకరించడం విశేషం. ఈ నేపథ్యంలో టైటిల్ గెలిచినందుకు సీఎస్‌కే జట్టును ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ లో స్పోర్ట్స్ డెవలప్ మెంట్, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై క్రీడల్ని ప్రోత్సహించేందుకు తన వంతుగా కృషి చేస్తానని అంబటి అన్నారు. తమ ప్రభుత్వం క్రీడారంగం పట్ల మంచి కార్యక్రమాలను రూపొందిస్తోందని అంబటికి సీఎం జగన్ హామీ ఇచ్చారు.