IRCTC Beta Portal: ఐఆర్‌సీటీసీ కొత్త బీటా వెబ్‌సైట్ ప్రారంభం.. టికెట్ బుకింగ్ మరింత సులభం
ఈ వార్తాకథనం ఏంటి
రైల్వే ప్రయాణికులకు టికెట్ బుకింగ్‌ను మరింత వేగవంతంగా, సులభంగా మార్చే లక్ష్యంతో ఐఆర్‌సీటీసీ (IRCTC) కొత్త బీటా వెర్షన్ వెబ్‌సైట్‌ను బుధవారం రాత్రి 9 గంటల నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త వెబ్‌సైట్‌లో అనవసరమైన క్యాప్చాలు, పాప్‌అప్స్ వంటి అంతరాయాలను తొలగించినట్లు రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది. దీంతో ప్రయాణికులు టికెట్ బుకింగ్‌ను మరింత సౌకర్యవంతంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. ఒకే చోట అన్ని బెర్తుల సమాచారం ఈ బీటా వెబ్‌సైట్‌లో అన్ని తరగతుల్లోని సీట్లు, బెర్తుల అందుబాటు వివరాలను ఒకేసారి పరిశీలించే అవకాశం కల్పించారు. దీంతో వేర్వేరు తరగతులను విడివిడిగా పరిశీలించాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.
వివరాలు
తగ్గిన బుకింగ్ దశలు.. సేవ్ చేసుకునే అవకాశం
టికెట్ బుక్ చేసేందుకు అవసరమైన ప్రక్రియను గణనీయంగా తగ్గించినట్లు రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది.
అలాగే ప్రయాణికులు తమ వ్యక్తిగత వివరాలను ముందుగానే వెబ్‌సైట్‌లో సేవ్ చేసుకునే సదుపాయం కల్పించారు.
దీంతో తరచుగా టికెట్లు బుక్ చేసుకునే వారికి ప్రతిసారీ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా సమయం ఆదా అవుతుందని వివరించింది.