IRS Officer : మహిళగా మారిన IRS అధికారి అనుకతిర్ సూర్య ఎవరు?
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తన పేరు లింగాన్ని మార్చమని అభ్యర్థించడం,దానిని ఆమోదించడం భారతీయ సివిల్ సర్వీస్ చరిత్రలో ఇదే మొదటిసారి. భారతీయ రెవెన్యూ సర్వీస్ (IRS) సీనియర్ అధికారి అయిన ఎమ్ అనుసూయ, 35, అన్ని అధికారిక రికార్డులలో తన పేరు లింగా( జెండర్) న్ని మార్చాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు.
M Anusya నుండి అనుకతిర్ సూర్యగా పేరు మార్పు
NDTV ప్రకారం, హైదరాబాద్‌లోని కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (CESTAT) చీఫ్ కమిషనర్ (అధీకృత ప్రతినిధి) కార్యాలయంలో జాయింట్ కమిషనర్ గా ఎం అనుసూయ పని చేసే వారు. అయితే తన పేరును M అనుకతిర్ సూర్య లింగం( జెండర్) హోదాను మార్చాలని మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. పురుషునిగా రికార్డుల్లో మార్చాలని అనుసూయ చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్నారు. ఇకపై అన్ని అధికారిక రికార్డుల్లో ఆ అధికారిని ఎం అనుకతిర్ సూర్యగా గుర్తిస్తామని మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
అనుకతిర్ సూర్య ఎవరు?
కధనాల ప్రకారం, అనుకతిర్ సూర్య డిసెంబర్ 2013లో చెన్నైలో అసిస్టెంట్ కమిషనర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. 2018లో డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతి పొందారు.సూర్య గత ఏడాది హైదరాబాద్‌లో తన ప్రస్తుత పోస్టింగ్‌లో చేరాడు. చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. 2023లో నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ, భోపాల్ నుండి సైబర్ లా ,సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా చేశారు.