
Atishi: దిల్లీ సీఎం భర్త ప్రభుత్వాన్ని నడుపుతున్నారు?.. అతిశీ ఫైర్!
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త భర్త మనీష్ గుప్తపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి అతిశీ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అనధికారికంగా ప్రభుత్వ కార్యకలాపాలను నడుపుతున్నారని ఆరోపించారు.
ఇందుకు ఆధారంగా మనీష్ గుప్తా ప్రభుత్వ అధికారులతో సమావేశమైన ఫొటోను ఆమె సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో షేర్ చేశారు.
ఒకప్పుడు గ్రామాల్లో మహిళలు సర్పంచులుగా ఎన్నికైతే వారి భర్తలే వ్యవహారాలు చూసేవారు. కానీ ఇప్పుడు ఓ మహిళా సీఎం చేయాల్సిన పనులు ఆమె భర్త చేస్తుండటం దేశ చరిత్రలోనే తొలిసారి కావచ్చు.
సీఎం పదవిలో ఉన్న ఆమెకు ప్రభుత్వ వ్యవహారాలు ఎలా నిర్వహించాలో తెలియదా? అని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు.
Details
కౌంటర్ ఇచ్చిన బీజేపీ అధ్యక్షుడు
అతిశీ వ్యాఖ్యల నేపథ్యంలో, దిల్లీలో విద్యుత్ కోతలు, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పెరుగుదలకు ప్రధాన కారణం సంబంధిత శాఖలపై సీఎం పట్టు లేకపోవడమేనని ఆమె పేర్కొన్నారు.
ఈ అంశాలు ప్రజలపై ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ ఆరోపణలకు దిల్లీ బీజేపీ అధ్యక్షుడు విరేంద్ర సచ్‌దేవా కౌంటర్ ఇచ్చారు.
ఒక మహిళా నాయకురాలు మరో మహిళా ముఖ్యమంత్రిపై ఈ రీతిగా అవమానకరంగా మాట్లాడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వివాదం ప్రస్తుతం ఢిల్లీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.