విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్వి సూర్యనా? 'బీజేపీ వీఐపీ బ్రాట్స్' కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనలు ఇటీవల ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఇండిగో విమానంలో జరిగిన ఒక ఘటనపై కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అయితే ఈ ఘటనలో నిందితుడిగా బెంగళూరు సౌత్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ తేజస్వీ సూర్య అంటూ ప్రచారం జరుగుతోంది. సూర్యనే ఆ డోర్ తెరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. ఓ వార్తా కథనాన్ని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ట్విట్టర్‌లో షేర్ చేసి బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్చించారు. 2022 డిసెంబర్ 10న చెన్నై నుంచి తిరుచిరాపల్లికి వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ వ్యక్తి ఎమర్జెన్సీ డోర్ తెరిచారు. ఈ ఘటనపై ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది.
ప్రయాణీకుల భద్రతపై ఎయిర్ లైన్స్ రాజీ పడిందా?: సూర్జేవాలా
డీజీసీఏ విచారణకు ఆదేశించిన కొన్ని గంటల్లోనే ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచింది ఎంపీ తేజస్వి సూర్య కాంగ్రెస్ ఆరోపించింది. తాజాగా రణదీప్ సింగ్ సూర్జేవాలా కూడా ఎంపీ తేజస్వి సూర్య అని పేర్కొంటూ.. ట్విట్టర్‌లో వార్తా కథనాన్ని షేర్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు రణదీప్ సింగ్ సూర్జేవాలా. బీజేపీ వీఐపీ బ్రాట్స్ అంటూ వ్యగ్యాస్త్రాలు సంధించారు. ఎయిర్‌లైన్‌కు ఫిర్యాదు చేయడానికి ఎంత ధైర్యం? బీజేపీ ప్రముఖులకు ఇది ఆనవాయితీగా మారిందా? ప్రయాణీకుల భద్రతపై ఎయిర్ లైన్స్ రాజీ పడిందా? ఓహ్! బీజేపీకి చెందిన వీఐపీల గురించి ప్రశ్నలు అడగలేరంటూ వ్యగ్యంగా ప్రశ్నించారు రణదీప్ సింగ్ సూర్జేవాలా. ఈ ఆరోపణలపై ఎంపీ తేజస్వి సూర్య నుంచి ఎలాంటి స్పందన రాలేదు.