
#NewsBytesExplainer: భవిష్యత్తు రాజకీయాలు ప్రతికారం వైపు పయనిస్తున్నాయా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఏమి జరుగుతోంది?
ఈ వార్తాకథనం ఏంటి
రాజకీయాలలో అనాగరిక ధోరణి వేగంగా విస్తరిస్తోందని స్పష్టంగా కనిపిస్తోంది. వర్గాల మధ్య తేడాలు,వ్యక్తిగత విభేదాలకు రాజకీయ రంగంలో చోటు దొరకడం వల్ల 'ఫ్యాక్షన్ భూతం' అనే ద్వేష రాజకీయ ధోరణి తిరిగి పెరుగుతోంది. గతంలో సాంప్రదాయ రాజకీయాలు అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంతో సాగినప్పటికీ, నేటి రాజకీయ వాతావరణంలో "రివెంజ్ రాజకీయాలు" ఒక ప్రబల ధోరణిగా మారాయి. ప్రతి పార్టీ గతంలో జరిగిన దుష్టచర్యలకు ప్రతీకారంగా వ్యవహరించాలనే ఉద్దేశ్యంతో ముందుకు వస్తోంది. పార్టీలు దీన్ని 'డబుల్ రిటాలియేషన్' (double retaliation) విధానంగా అనుసరిస్తున్నాయి. ఒక పార్టీ 'రెడ్ బుక్' విధానాన్ని అవలంబిస్తే, మరొక పార్టీ 'డిజిటల్ బుక్'తో ప్రతిగా ముందుకు వస్తుంది.
వివరాలు
2014 తర్వాత రాజకీయ దృక్కోణం
మేము అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామన్న భావనలో పార్టీలు, నేతలు మారారంటే రాజకీయాలు ఎటు వైపు పయనిస్తున్నాయో అర్ధమవుతోంది. 2014 ఎన్నికలకు ముందు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజాస్వామ్య విధానాన్ని పాటిస్తూ అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పనిచేసేవి. కానీ 2014 తర్వాత రాజకీయ పరిణామాలు పూర్తిగా మారాయి. సోషల్ మీడియా విస్తరణతో పాటు, రాజకీయాలకు వ్యక్తిగత దాడుల వాతావరణం ఏర్పడింది. పార్టీలు తమ సోషల్ మీడియా పేజీలను ఉపయోగించి ప్రత్యర్థులపై నెగటివ్ ప్రచారాన్ని పటిష్టం చేసాయి. ఇది రాజకీయాలను వ్యక్తిగత ద్వేషాలకు దారితీసింది.
వివరాలు
2014 తర్వాత రాజకీయ దృక్కోణం
ఫలితంగా, అధికార పార్టీ ప్రత్యర్థి కార్యకర్తలను, నేతలను వేధించే దిశగా దాడులు సాగించడమే కాకుండా, ప్రత్యర్థి నేతలపై లక్ష్యపూర్వకంగా విరుచుకుపడే ప్రవర్తన పెరిగింది. 2019లో వైసిపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక దుష్టాంతాలు జరిగాయని టిడిపి ఆరోపిస్తుంది. ముఖ్యంగా ప్రత్యర్ధులను మాటు వేసి చంపారని దానికి మాచర్ల నియోజకవర్గంలో జరిగిన సంఘటలే నిదర్శనమని టిడిపి అరోపించింది. టిడిపి కార్యకర్తలను వేధించిన నేతలే టార్గెట్ గా వారి పేర్లను రెడ్ బుక్ లో నమోదు చేస్తు న్నామని అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు చేపడతామని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా చెప్పారు. అనుకున్నట్లే పార్టీ అధికారంలోకి రావడం ప్రత్యర్థులపై విరుచుకు పడటం చూస్తూనే ఉన్నాం.
వివరాలు
పార్టీలకు పనిచేయాలంటేనే జంకుతోన్ననేతలు,కార్యకర్తలు
వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని ప్రాంతాల్లో,ముఖ్యంగా పల్నాడులో, గురజాల నియోజకవర్గంలోని జూలకల్లు గ్రామంలో వైసిపి కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయి. పిన్నెల్లి గ్రామానికి చెందని అనేక మంది కార్యకర్తలు గ్రామాన్ని వీడి వెళ్ళారు.గతంలో ఇదే పరిస్థితి వైసీపీ పాలనలో కొనసాగింది. ఆ సమయంలో మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లోని పిన్నెల్లి, ఆత్మకూరు గ్రామాల అనేక కుటుంబాలు గ్రామాన్ని వదిలి వలస వెళ్ళాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో టిడిపి కేంద్ర కార్యాలయం వద్ద టెంట్లు ఏర్పాటు చేసి, బాధితులకు పునరావాసం కల్పించింది. అదే విధంగా, ఇప్పుడు వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడానికై రెడ్ బుక్ విధానాన్ని అమలు చేస్తూ ప్రతిఘటించే శైలిలో పాలన కొనసాగిస్తోంది. దీని ప్రభావంతో పార్టీలో కార్యకర్తలు, నేతలు భయాందోళనకు లోనవుతున్నారు.
వివరాలు
వైసిపి 'డిజిటల్ బుక్' అలాంటిదే
ఒక వైపు టిడిపి రెడ్ రాజ్యాంగాన్ని నడుపుతుందని ఆరోపిస్తూనే మరో వైపు వైసిపి డిజిటల్ బుక్ ఏర్పాటు కు శ్రీకారం చుట్టింది. వైసిపి కార్యకర్తలను వేధిస్తున్న టిడిపి నేతల పేర్లను నమోదు చేయాలని వైసిపి నిర్ణయించింది. అంతేకాదు ప్రతి మండలంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందుకు అనుగుణంగా నెట్వర్కును కూడా ఏర్పాటు చేయాలని వైసిపి అధినేత జగన్ పార్టీ నేతలకు సూచించారు. దీంతో అన్నీ నియోజక వర్గాలలో డిజిటల్ బుక్ ను ఏర్పాటు చేశారు.
వివరాలు
వినాశకాలే విపరీత బుద్ది
పార్టీలు చేస్తున్న అప్రజాస్వామిక చర్యలు భౌవిష్యత్తు తరాలకు ఏ సందేశాన్ని ఇస్తున్నాయో ఇదే పనిగా అర్ధమవుతోంది. 'వాళ్ళు వస్తే వీళ్ళ మీద దాడులు..వీళ్ళు వస్తే వాళ్ళ మీద దాడులు' అన్న చందంగా రాజకీయాలు మారిపోయాయని పలువురు సీని యర్ రాజకీయ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. వీరు చేస్తున్నా చర్యల కారణంగా అభివృద్ధి, సంక్షేమం మాట ఎలా ఉన్నా పార్టీ భవితవ్యం ఏ విధంగా ఉంటుందోనన్న భావన వ్యక్తమవు తోంది. ఇలాంటి చర్యలను చూస్తుంటే వినాసకాలే విపరీత ధోరణి అన్న చందంగా పార్టీల వ్యవహార శైలి మారిపోతోంది.
వివరాలు
రాష్ట్రాన్ని శాసిస్తున్న వైసిపి, టిడిపి పార్టీలు
రాష్ట్రంలో టిడిపి, వైసిపి పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్నాయి. పాలిస్తే ఈ పార్టీలే పాలించాలన్న భావనగా కనిపిస్తోంది. 2014 నుంచి 2024 ఎన్నికలను పరిశీలిస్తే ఇదే భావన వస్తుంది. 2024లో కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో జనసేన కొద్దిగా బలపడి సీట్లు సాధించినప్పుటికీ,ప్రధానంగా టిడిపి, వైసిపి మీదనే ప్రజల ఫోకస్ ఎక్కువగా ఉంటుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు.