LOADING...
P Chidambaram: పాక్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చే ప్రయత్నమా?: చిదంబరం వ్యాఖ్యలపై ఫైర్!
పాక్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చే ప్రయత్నమా?: చిదంబరం వ్యాఖ్యలపై ఫైర్!

P Chidambaram: పాక్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చే ప్రయత్నమా?: చిదంబరం వ్యాఖ్యలపై ఫైర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 28, 2025
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంటులో 'ఆపరేషన్‌ సిందూర్‌'పై వాడివేడి చర్చలకు ముస్తాబవుతోంది. సోమవారం నుంచి ఉభయసభల్లో దీని గురించి సుదీర్ఘంగా చర్చించనున్నారు. అయితే ఈ చర్చలకు ముందే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో కొత్త దుమారాన్ని రేపాయి. పహల్గాం ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) దేశీయ ఉగ్రవాదులే కారణమై ఉండొచ్చన్న వ్యాఖ్యలతో వివాదం చెలరేగింది. ఒక ఆంగ్ల మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ.. 'పహల్గాం ఘటనపై కేంద్రం స్పష్టత ఇవ్వడం లేదు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే కీలక ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. వారు దేశీయంగా ఉన్నవారై ఉండొచ్చన్న సందేహాలు ఉన్నాయి.

Details

పార్లమెంట్ లో మాట్లాడానికి ఎందుకు రాలేదు

అలాంటప్పుడు వారికి పాకిస్థాన్‌ సంబంధం ఉందని ఎలా నిర్ధారించగలుగుతున్నారు? దానికి ఆధారాలేంటి?'' అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. అంతేగాక పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' సమయంలో భారత వర్గాల్లో జరిగిన నష్టాల వివరాలను ప్రభుత్వం వెల్లడించకుండా మౌనంగా ఉండడాన్ని ఆయన విమర్శించారు. 'ఈ అంశంపై ప్రధాన మంత్రి మోదీ పలు ప్రదేశాల్లో ప్రసంగించారు. కానీ పార్లమెంట్‌లో మాత్రం ఎందుకు మాట్లాడటానికి ముందుకు రావడం లేదని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మొదట కాల్పుల విరమణ ప్రకటన చేశారని గుర్తుచేస్తూ కేంద్ర వైఖరిని ఆయన తాకీదారు.

Details

తీవ్రంగా స్పందించిన బీజేపీ

ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ ఐటీ సెల్‌ ఇన్‌చార్జ్ అమిత్ మాలవీయ ధ్వజమెత్తుతూ.. 'కాంగ్రెస్‌ మరోసారి పాకిస్థాన్‌కు క్లీన్‌చిట్‌ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తోంది. ప్రతిసారీ మన భద్రతా దళాలు ఉగ్రవాదంపై ఘాటుగా స్పందించినప్పుడు.. కాంగ్రెస్‌ నాయకులు భారత్‌ ప్రతిపక్షంగా కాకుండా ఇస్లామాబాద్‌ తరఫు లాయర్ల్లా ప్రవర్తిస్తారు. దేశ భద్రత విషయాల్లో స్పష్టత ఉండగా.. కాంగ్రెస్‌ మాత్రం శత్రువుల వైపు నిలబడడమే అలవాటుగా మార్చుకుందని తీవ్ర విమర్శలు గుప్పించారు.