
Uttar Pradesh:'27 ఏళ్లుగా కుటుంబంతో కలిసి హోలీ జరుపుకోలేకపోయా'.. ఓ పోలీసు ఆవేదన
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయి.
ప్రతి ప్రాంతంలోనూ ప్రజలు ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో మునిగితేలుతున్నారు.
అయితే హోలీ సందర్భంగా భద్రతా విధుల్లో నిమగ్నమైన పోలీసులు తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి వస్తోంది.
ఈకారణంగా వారు కొంతవరకు అసంతృప్తిగా ఉన్నారు.ఇదే సందర్భంలో,ఓపోలీసు తన కుటుంబంతో హోలీ జరుపుకోలేకపోతున్నానంటూ ఒక వీడియో విడుదల చేయగా,అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సాధారణంగా పండుగలసమయంలో అందరికీ సెలవులు ఉంటాయి.లేదంటే,వారు సెలవు పెట్టుకుని ఇంటిలో కుటుంబ సభ్యులతో పండుగను ఆనందంగా గడుపుతారు.
కానీ తనకు గత 27ఏళ్లుగా కుటుంబంతో హోలీ జరుపుకునే అవకాశం లభించలేదని కానిస్టేబుల్ సంజీవ్ కుమార్ సింగ్ సోషల్ మీడియా వేదికగా తన బాధను వ్యక్తం చేశాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్ అయ్యిన వీడియో ఇదే..
यूपी पुलिस के संजीव कुमार सिंह जी का वीडियो देखकर मन बड़ा चिंतित हुआ जिन्होंने लगातार 27 साल सेवा दी है
— Adv Deepak Babu (@dbabuadvocate) March 13, 2025
लेकिन संजीव कुमार जी की माता जी का भी देहांत पिछले साल हुआ है और उनकी इस बार पहली होली है गांव में उनकी उपस्थिति अनिवार्य है लेकिन छुट्टी नहीं मिल पाई है और लगातार कुंभ में भी… pic.twitter.com/MGZgbtGtPm
వివరాలు
పోలీసు విధుల కారణంగా..
ఈ వీడియోలో సంజీవ్ కుమార్ మాట్లాడుతూ, "మిత్రులారా, ఈ రోజు నాకు చాలా బాధగా ఉంది. నేను గత 27 ఏళ్లుగా పోలీస్ డ్యూటీ చేస్తున్నాను. కానీ, ఈ 27 ఏళ్లలో ఒక్కసారైనా నా కుటుంబంతో కలిసి హోలీ జరుపుకోలేకపోయాను. మహాకుంభ్ డ్యూటీ పూర్తయిన తర్వాత సెలవు వస్తుందని భావించాను. కానీ అది కూడా సాధ్యం కాలేదు. ఇప్పుడు నేను హర్దోయీ (యూపీ)కి వెళ్లలేను. ప్రజలందరూ తమ స్వస్థలాలకు వెళ్లి హోలీ వేడుకలను ఆనందంగా జరుపుకుంటున్నారు. అయితే పోలీసు విధుల కారణంగా నేను ఇంటికి వెళ్లలేనని నా కుటుంబ సభ్యులకు చెప్పాల్సి వచ్చింది" అని తన ఆవేదనను పంచుకున్నారు.