
రోబో పార్కు రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందడం ఖాయం : కేటీఆర్
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో రోబోటిక్ టెక్నాలజీ గేమ్ చేంజర్ గా అవుతుందని ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు.
తెలంగాణ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రోబోటిక్స్ రంగంలో రోబో పార్కు రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందడం ఖాయమన్నారు.
వచ్చే జూలైలో గ్లోబల్ రోబోటిక్స్ సమ్మిట్ ను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోందన్నారు. మంగళవారం హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీహబ్ లో రోబోటిక్ ఫ్రేమ్ వర్క్ ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో స్థిరమైన రోబోటిక్స్ పర్యావరణ వ్యవస్థను సృష్టించడం అద్భుతంగా ఉందని కొనియాడారు.
Details
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో తెలంగాణ ముందంజ
చైనా, జపాన్, అమెరికా తర్వాత పదో దేశంగా భారత్ గుర్తింపు పొందడం కేటీఆర్ హర్షణీయమన్నారు.
అనంతరం ఐఐటీ హైదరాబాద్, ఆర్ట్ పార్కు ఐఐఎస్‌సీ, జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, ఏజీహబ్, ఆలిండియా రోబోటిక్స్ ఆసోసియేషన్ వంటి సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోవడం విశేషం.
అదే విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం గొప్ప విషయని కేటీఆర్ తెలియజేశారు.