NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కూల్ రూఫ్ విధానాన్ని ప్రారంభించిన కేటీఆర్; దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ
    కూల్ రూఫ్ విధానాన్ని ప్రారంభించిన కేటీఆర్; దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ
    1/2
    భారతదేశం 1 నిమి చదవండి

    కూల్ రూఫ్ విధానాన్ని ప్రారంభించిన కేటీఆర్; దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ

    వ్రాసిన వారు Naveen Stalin
    Apr 03, 2023
    06:33 pm
    కూల్ రూఫ్ విధానాన్ని ప్రారంభించిన కేటీఆర్; దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ
    కూల్ రూఫ్ పాలిసీ ప్రారంభించిన కేటీఆర్; దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ

    తెలంగాణ కూల్ రూఫ్ పాలసీని సోమవారం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావాన్ని తగ్గించడంతో పాటు ఇంధన వినియోగాన్ని పరిమితం చేసే లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు. దీంతో కూల్ రూఫ్ పాలసీని ప్రారంభించిన దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఈ విధానం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులతో పొందుపరచబడినట్లు చెప్పారు. తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ 2023-28 విపరీతమైన వేడిని తట్టుకునే శక్తిని పెంపొందించడానికి కూల్ రూఫ్‌ విధానం ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

    2/2

    కూల్ రూఫ్ పాలసీపై ఆధారపడటం వల్ల విద్యుత్ ఆదా: కేటీఆర్

    వేడి నుంచి రక్షణ కోసం విద్యుత్‌‌ను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించే బదులు, కూల్ రూఫ్ పాలసీపై ఆధారపడటం వల్ల ఇంధన వినియోగం తగ్గుతుందన్నారు. తద్వారా పర్యావరణ అనుకూల రాష్ట్రంగా తెలంగాణ మారుతుందన్నారు. సైట్ ప్రాంతం లేదా నిర్మించిన ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్యంలోని నివాసేతర, వాణిజ్య భవనాలకు ఇప్పుడు కూల్ రూఫ్ తప్పనిసరిని కేటీఆర్ స్పష్టం చేశారు. 600 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ ప్లాట్ ఏరియా ఉన్న నివాస భవనాలకు కూల్ రూఫ్ అప్లికేషన్ తప్పనిసరి చేసినట్లు పేర్కొన్నారు. 600 చదరపు గజాల కంటే తక్కువ ఉన్న వారు వారి ఇష్టానుసారం కూల్ రూఫ్ పాలసీని ఎంచుకోవచ్చని వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    తెలంగాణ
    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    విద్యుత్

    కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    ఎల్బీనగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్; ఇక సిగ్నల్ ఫ్రీ జంక్షన్ తెలంగాణ
    గుజరాత్‌లో 13సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయ్: సంజయ్‌పై కేటీఆర్ ఫైర్ తెలంగాణ
    నేడు మళ్లీ ఈడీ విచారణకు హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    తెలంగాణ: ప్రయాణికుల భద్రత కోసం క్యాబ్, ఆటో ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు హైదరాబాద్

    తెలంగాణ

    10వ తరగతి తెలుగు పేపర్ లీక్; ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు తాజా వార్తలు
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఆంధ్రప్రదేశ్
    ఇద్దరు పిల్లలు ఉన్న వారికే ఓటు హక్కు; ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు టి. రాజాసింగ్
    ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో విషాదం కల్వకుంట్ల కవిత

    భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    'ఫోన్లను ఓపెన్ చేసేందుకు సిద్ధం'; కవితకు లేఖ రాసిన ఈడీ జాయింట్ డైరెక్టర్ కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ కల్వకుంట్ల కవిత
    మార్చి 26న మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగ సభ; సీఎం కేసీఆర్ హాజరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    దిల్లీలో కవితను ప్రశ్నిస్తున్న ఈడీ; హైదరాబాద్ లో బీజేపీకి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు కల్వకుంట్ల కవిత

    విద్యుత్

    సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలంగాణ
    సింగరేణిపై వేసవి ఎఫెక్ట్: రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం బొగ్గు శాఖ మంత్రి
    ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం ఆంధ్రప్రదేశ్
    రికార్డు బద్దలు కొట్టిన ఏపీ జెన్ కో.. ఒక్కరోజులో 105.602 మిలియన్ యూనిట్ల విద్యుత్ విజయవాడ సెంట్రల్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023