
IT Raids: ఏపీ, తెలంగాణలో పలుచోట్ల ఐటీ దాడులు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ భారీ సోదాలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని 25 ప్రాంతాల్లో అధికారులు ఒకేసారి తనిఖీలు నిర్వహిస్తున్నారు. రూ.300 కోట్ల దాల్ ట్రేడ్ కేసుతో సంబంధం ఉన్న సంస్థలు, వ్యాపార వేత్తల ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయని సమాచారం. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో పలు ట్రేడింగ్ కంపెనీలు అనుమానాస్పదంగా భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపినట్లు అధికారులు గుర్తించారు.
Details
ఆధారాలను పరిశీలిస్తున్న అధికారులు
2024 ఎన్నికల సమయంలో కూడా ఈ కంపెనీలు విపరీతంగా నగదు విత్‌డ్రా చేసిన రికార్డులు ఉన్నాయని ఐటీ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా పౌర సరఫరాల శాఖ నుండి అనుమతులు పొందిన కొంతమంది వ్యాపారులు పప్పు దినుసులు సరఫరా చేయకపోయినా, పెద్ద మొత్తంలో బిల్లులు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై స్పష్టమైన ఆధారాలు సేకరించేందుకు అధికారులు రికార్డులు, బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నారు.