TMC Leader Abhishek Benarji: టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ హెలీకాప్టర్ లో ఐటీ సోదాలు
టీఎంసీ (TMC) పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ (Abhishek Benarji) హెలీకాప్టర్ లో ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహించింది. కోల్ కతా (Kolkata) లోని బెహ్లా ఫ్లయింగ్ క్లబ్ లో ఆదాయపన్ను శాఖ (ఐటీ) ఈ సోదాలు నిర్వహించింది. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అభిషేక్ బెనర్జీ పశ్చిమ మేదినీ పూర్ లోని హల్దియా వెళ్లేందుకు ఆదివారం హెలీకాప్టర్ ను సిద్ధం చేసే క్రమంలో బెహ్లా ఫ్లయింగ్ క్లబ్ లో ట్రయిల్ నిర్వహిస్తున్న సమయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు వచ్చి సోదాలు నిర్వహించినట్లు టీఎంసీ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్షాలను ఎదుర్కోలేకే బీజేపీ ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని టీఎంసీ పార్టీ మండిపడింది.
ఎలాంటి సోదాలు చేయలేదు: ఐటీ అధికారులు
అయితే ఐటీ శాఖ చేసిన సోదాల్లో ఏమీ దొరకకపోవడంతో సహనం కోల్పోయిన ఆదాయపన్ను శాఖ అధికారులు హెలీకాప్టర్ ను ఎగిరేందుకు అనుమతి నివ్వలేదని ఆగ్రహం టీఎంసీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బెహ్లా ఫ్లయింగ్ క్లబ్ లో ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహించిందన్న విషయాన్ని అభిషేక్ బెనర్జీ కూడా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇదిలా ఉండగా బెహ్లా ఫ్లయింగ్ క్లబ్ లో తాము ఎటువంటి సోదాలు నిర్వహించలేదని ఆదాయపన్ను శాఖ అధికారులు వివరణ ఇచ్చారు.