Page Loader
Revanth Reddy: జాతీయ విపత్తుగా ప్రకటించాలి.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి
జాతీయ విపత్తుగా ప్రకటించాలి.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి

Revanth Reddy: జాతీయ విపత్తుగా ప్రకటించాలి.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 02, 2024
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలోని వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించి, రాష్ట్రానికి తక్షణ ఆర్థిక సాయం అందించాలని కోరారు. హైదరాబాద్‌లోని ట్రాఫిక్‌ సమస్యలు అధిగమించేందుకు పోలీసు కమిషనర్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలన్నారు.

Details

రేపు మహబూబాబాద్ జిల్లాలో సీఎం పర్యటన

విద్యుత్‌ సరఫరా సమస్యలను నిరంతరం పర్యవేక్షించి పరిష్కరించాలని ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి రోడ్డు మార్గంలో ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించేందుకు బయలుదేరారు. మార్గమధ్యలో కోదాడ ప్రాంతంలో కూడా వరద ముంపు పరిస్థితులను సమీక్షించారు. రాత్రి ఖమ్మంలో బస చేసి, మంగళవారం మహబూబాబాద్‌ జిల్లాలో ఆయన పర్యటించనున్నారు.