LOADING...
Operation Sindoor: రాజౌరి దాడుల్లో ఏడీసీ మృతి, ఇద్దరికీ గాయాలు 
రాజౌరి దాడుల్లో ఏడీసీ మృతి, ఇద్దరికీ గాయాలు

Operation Sindoor: రాజౌరి దాడుల్లో ఏడీసీ మృతి, ఇద్దరికీ గాయాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 10, 2025
08:11 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-పాకిస్థాన్ మధ్య పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తత పరిస్థితుల్లోకి వెళ్లిపోయాయి. సరిహద్దుల్లో కాల్పులకే పరిమితమవకుండా, పాకిస్థాన్‌ ఇప్పుడు డ్రోన్లను వినియోగిస్తూ ప్రణాళికాబద్ధంగా దాడులకు తెగబడుతోంది. ఈ క్రూర దాడుల్లో జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ముఖ్య అధికారి రాజ్‌కుమార్ థప్పా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమైన అంశంగా మారింది. రాజౌరీ పట్టణంలో నివాసం ఉంటున్న ఆయన నివాసంపై పాకిస్థాన్ బలగాలు జరిపిన ఫిరంగుల దాడిలో ఆయన ప్రాణాలు విడిచారు. ఈ విషాద సంఘటనపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు.

వివరాలు 

జిల్లా డెవలప్‌మెంట్ కమిషనర్‌గా  రాజ్‌కుమార్‌ 

ప్రస్తుతం రాజ్‌కుమార్‌ జిల్లా డెవలప్‌మెంట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాజ్‌కుమార్ మరణంపై ఒమర్‌ అబ్దుల్లా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. "మన దేశానికి అత్యంత నిబద్ధతతో పనిచేసే ఒక ప్రభుత్వాధికారిని కోల్పోయాం. ఒక రోజు ముందు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నాడు. అలాంటి వ్యక్తి మరుసటి రోజే ఈ దుర్మార్గపు దాడిలో ప్రాణాలు కోల్పోవడం నాకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. పాక్‌ జరిపిన ఈ దాడి వల్ల మాకు నష్టం ఏర్పడింది. ఇది వర్ణించడానికి మాటలు రావడంలేదు" అంటూ పేర్కొన్నారు.

వివరాలు 

శ్రీనగర్‌, పఠాన్‌కోట్‌ పరిసరాల్లో పేలుళ్లతో ఉలిక్కిపడిన ప్రజలు 

ఇక శనివారం తెల్లవారుఝామున కూడా పాకిస్థాన్‌ సైన్యం మరోసారి దాడులకు పాల్పడింది. శుక్రవారం రాత్రి నుంచే సరిహద్దు ప్రాంతాల్లో బాంబులు పేలుతున్న శబ్దాలు వినిపించడంతో, అప్రమత్తమైన అధికారులు విద్యుత్‌ సరఫరాను తక్షణమే నిలిపివేశారు. బ్లాకౌట్‌ ప్రకటించి ప్రజలను అపాయ సూచనల ద్వారా హెచ్చరించారు. శ్రీనగర్‌తో పాటు పఠాన్‌కోట్‌ పరిసర ప్రాంతాల్లో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అక్కడి ప్రజలు పేర్కొన్నారు. పాక్‌ డ్రోన్ల ద్వారా దాడి చేసినప్పటికీ,భారత బలగాలు సమర్థవంతంగా స్పందించి వాటిని తిప్పికొట్టాయి. పఠాన్‌కోట్‌లో ఉదయం 5 గంటల సమయంలో భారీ శబ్దాలు విన్నట్టు నివేదికలు వచ్చాయి. అయితే, దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ దాడుల ప్రభావంతో పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌లో ముగ్గురు వ్యక్తులు గాయపడినట్టు సమాచారం.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఒమర్ అబ్దుల్లా చేసిన ట్వీట్ 

Advertisement