Encounter: కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లా హంద్వారాలో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు టెర్రరిస్ట్‌లు హతమయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రుంబురా, జచల్‌దారా రాజ్‌వార్ ప్రాంతంలో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించిన బలగాలు.. ఆ ప్రాంతంలో ఆపరేషన్ చేపట్టాయి.
ఈ క్రమంలో ఉగ్రవాదులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకన్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసు అధికారి తెలిపారు.
వివరాలు
ముగ్గురు ఉగ్రవాదులను చుట్టుముట్టారు
స్థానిక మీడియా నివేదికల ప్రకారం, భద్రతా దళాలు ఈ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్లు ధృవీకరించాయి, వారిని అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. మధ్య మధ్యలో 2 గంటల పాటు కాల్పులు నిలిచిపోయాయి.
ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో అదనపు సైనికులను కూడా రప్పించారు. ఉగ్రవాదులు దాక్కున్న ప్రాంతాలు అడవులు, పర్వతాలతో చుట్టుముట్టాయని, అవి జనావాసాలున్నాయని చెప్పారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్
जम्मू और कश्मीर ,सुरक्षा बलो ने हंदवाड़ा जिले के क्रुम्भूरा इलाके में चलाया घेराबंदी और तलाशी अभियान #Everyone #highlight2025 pic.twitter.com/9iWCZWrm5z
— Amar nath jha (@Anjhakaushambi) March 17, 2025