LOADING...
Doctor Terror: ఇళ్లను పేలుడు కేంద్రాలుగా మార్చిన డాక్టర్లు.. ఉగ్ర కేసులో షాకింగ్ విషయాలు
ఇళ్లను పేలుడు కేంద్రాలుగా మార్చిన డాక్టర్లు.. ఉగ్ర కేసులో షాకింగ్ విషయాలు

Doctor Terror: ఇళ్లను పేలుడు కేంద్రాలుగా మార్చిన డాక్టర్లు.. ఉగ్ర కేసులో షాకింగ్ విషయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 17, 2026
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట వద్ద గత ఏడాది జరిగిన ఆత్మాహుతి దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ ఘటనతో బయటపడిన 'డాక్టర్ ఉగ్ర ముఠా'పై జమ్ముకశ్మీర్ రాష్ట్ర దర్యాప్తు సంస్థ సమగ్ర దర్యాప్తు చేపట్టి తాజాగా అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. ఈ పత్రంలో ఎన్నో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీనగర్లోని నౌగామ్ పోలీస్ కేంద్రంలో నమోదైన ఫిర్యాదు ఆధారంగా ఈ దర్యాప్తు సాగింది. మొత్తం పది మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో ఎర్రకోట దాడిలో మరణించిన డాక్టర్ ఉమర్ నబీతో పాటు మరో నలుగురు వైద్యులు ఉన్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన వీరు తీవ్రవాద భావజాలానికి లోనై తప్పుదారిలో నడిచినట్లు వెల్లడైంది.

వివరాలు 

'టీఏటీపీ'.. కొత్త టెర్రర్‌ వ్యూహం..

ఈ ఉగ్ర ముఠా అత్యంత ప్రమాదకరమైన ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్ అనే పేలుడు పదార్థాన్ని ఉపయోగించినట్లు దర్యాప్తులో తెలిసింది. ఇది అత్యంత అస్థిర స్వభావం కలిగినది. సాధారణ సైనిక స్థాయి పేలుడు పదార్థాలతో పోలిస్తే దీనిని సులభంగా తయారు చేయగలరని వెల్లడైంది. సాధారణంగా మార్కెట్లో దొరికే రసాయనాలతో తయారీ సాధ్యమవుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు దాడుల్లో దీనిని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు దేశంలోనే, ముఖ్యంగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దీనిని తయారు చేయడం దర్యాప్తు సంస్థలను ఆందోళనకు గురిచేస్తోంది.

వివరాలు 

ఇళ్లే తయారీ కేంద్రాలుగా..

దర్యాప్తులో మరో కీలక అంశం బయటపడింది. వృత్తి నైపుణ్యం కలిగిన నిందితులు తమ ఇళ్లను, ప్రయోగశాలలను పేలుడు పదార్థాల తయారీ కేంద్రాలుగా మార్చుకున్నట్లు తెలిసింది. ఈ రకమైన పేలుడు పదార్థాలను గుర్తించడం కూడా కష్టసాధ్యమవుతోంది. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి కావడంతో తయారీ సమయంలోనే పేలే అవకాశాలు ఎక్కువగా ఉండి అనుకోని ప్రమాదాలకు దారితీస్తున్నాయి. గతంలో జమ్మూ కశ్మీర్లో ఉగ్ర ముఠాలు పేలుడు పదార్థాల అక్రమ రవాణాపైనే ఆధారపడేవి. అయితే ప్రస్తుతం వీరి వ్యూహాలు మారిపోయాయి. సరిహద్దు ప్రాంతాలపై ఆధారపడకుండా స్వయంగా తయారీ చేయడం ప్రారంభించడం భద్రతా సంస్థలకు పెద్ద సవాలుగా మారింది.

Advertisement