Loading...
YS Jagan Mohan Reddy: యలహంక ప్యాలెస్‌లోకి షర్మిల వెళ్లకుండా జగన్ పిటిషన్.. దేవనహళ్లి కోర్టులో ఏం జరగనుంది?
యలహంక ప్యాలెస్‌లోకి షర్మిల వెళ్లకుండా జగన్ పిటిషన్.. దేవనహళ్లి కోర్టులో ఏం జరగనుంది?

YS Jagan Mohan Reddy: యలహంక ప్యాలెస్‌లోకి షర్మిల వెళ్లకుండా జగన్ పిటిషన్.. దేవనహళ్లి కోర్టులో ఏం జరగనుంది?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2026
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సోదరి షర్మిల మధ్య బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌ వివాదం మరో మలుపు తిరిగింది. ప్యాలెస్‌లోకి షర్మిల ప్రవేశించకుండా స్టే ఇవ్వాలని కోరుతూ జగన్‌ కోర్టును ఆశ్రయించారు. దేవనహళ్లి కోర్టులో సిలికాన్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌ పేరుతో పిటిషన్‌ దాఖలు చేశారు. తన కుమార్తె అంజలి వివాహ పనుల్లో భాగంగా షర్మిల ఆదివారం యలహంక ప్యాలెస్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన జగన్‌.. ఆమెను అడ్డుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. యలహంక ప్యాలెస్‌లోనే కుమార్తె వివాహం జరిపించాలని తొలుత షర్మిల భావించినప్పటికీ, జగన్‌ అభ్యంతరం చెప్పడంతో ఇప్పటికే పెళ్లి వేదికను మార్చుకున్నారు. తాజాగా ప్యాలెస్‌లోకి షర్మిల అడుగుపెట్టకుండా జగన్‌ కోర్టును ఆశ్రయించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

వివరాలు

తన నివాసమని చెప్పి పెళ్లికి అభ్యంతరం తెలిపిన జగన్

2019లో కుదిరిన ఒప్పందం ప్రకారం ప్యాలెస్‌పై యాజమాన్య హక్కులు తనకే ఉన్నాయని షర్మిల చెబుతున్నారు. కుమార్తె అంజలి వివాహాన్ని యలహంక ప్యాలెస్‌లో నిర్వహించాలని షర్మిల నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు వేదిక వివరాలతో ఆహ్వాన పత్రికలు ముద్రించి బంధుమిత్రులకు పంపిణీ చేశారు. అయితే, అక్కడ వివాహం నిర్వహించడానికి వీల్లేదంటూ జగన్‌ అభ్యంతరం తెలిపారు.

'నేను నివసిస్తున్న ప్రాంగణంలో పెళ్లి చేస్తే తీవ్ర భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయి. అందరి దృష్టి నా నివాసంపై పడుతుంది.

ఇది నా ఇల్లు. ఇక్కడ నా కుటుంబం సురక్షితంగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నాను' అంటూ షర్మిలకు జగన్‌ లేఖ రాశారు. దీంతో ఆమె వివాహ వేదికను మార్చుకున్నారు.

వివరాలు

యలహంక భూమి షర్మిలదేనన్న విజయమ్మ

మరోవైపు బెంగళూరులోని యలహంక భూమి తన కుమార్తె షర్మిలదేనని మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ గతంలోనే వెల్లడించారు.

తన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి.. షర్మిలకు రాసిచ్చిన ఎంవోయూలో పేర్కొన్న ప్రతి ఆస్తితో పాటు, సరస్వతి సిమెంట్‌ సహా ఆ ఒప్పందంలో ప్రస్తావించని యలహంక భూమి కూడా షర్మిలదేనని ఆమె స్పష్టం చేశారు.

ఈ మేరకు ఈ ఏడాది మార్చి 20న 'క్లారిఫికేషన్‌' పేరుతో విజయమ్మ బహిరంగ ప్రకటన విడుదల చేశారు.

న్యాయవాదితో నోటరీ చేయించిన అనంతరం ఈ ప్రకటనను వెలువరించారు.

కుమార్తె వివాహ పనుల కోసం యలహంక ప్యాలెస్‌లోకి వెళ్లేందుకు షర్మిల ఆదివారం బెంగళూరుకు వెళ్తున్న నేపథ్యంలో.. దేవనహళ్లి కోర్టు ఈ పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT