
భోగాపురం విమానాశ్రయానికి జగన్ శంకుస్థాపన; మత్స్యం ఆకారంలో నిర్మించనున్న జీఎంఆర్
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు.
ఏపీ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, జీఎంఆర్ గ్రూప్‌ల మధ్య ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో విజయనగరం జిల్లా భోగాపురంలో ఈ విమానాశ్రయాన్ని అన్ని హంగులతో నిర్మించనున్నారు.
ఈ విమానాశ్రయాన్ని విభిన్నంగా నిర్మించేందుకు జీఎంఆర్ సంస్థ ఇప్పటికే నమూనాను సిద్ధం చేసింది. ఈతో కొడుతున్న చేప ఆకారంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అబ్బురపరిచేలా జీఎంఆర్ నిర్మించనుంది.
ఈ నమూనాకు సీఎం జగన్ కూడా ఆమోదం తెలిపారు.
విజయనగరం
రూ. 4,592 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం
భోగాపురం విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధికి, ఉత్తర ఆంధ్రలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి కీలకంగా మారుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఈ విమానాశ్రయాన్ని దాదాపు రూ.4,592 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు.
జీఎంఆర్ గ్రూప్ భోగాపురం విమానాశ్రయాన్ని మూడేళ్లలో నిర్మించి అందుబాటులో తెచ్చేందుకు సిద్ధమవుతోంది.
2,203 ఎకరాల విస్తీర్ణంతో భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని నిర్మించనున్నారు.
తొలి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు ఈ విమానాశ్రయం సేవలు అందిస్తుంది.
రెండో దశలో 1.2కోట్ల మంది, మూడో దశలో 1.8 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా దీన్ని అప్‌గ్రేడ్ చేయనున్నారు.
జగన్
22ఎయిర్ బ్రిడ్జిల ఏర్పాటు
ప్రయాణీకుల టెర్మినల్, విమాన నిర్వహణ, మరమ్మతుల కోసం ఏవియేషన్ అకాడమీ, కార్గో కాంప్లెక్స్, ఎంఆర్ఓ యూనిట్‌తో పాటు ఏడు ఎయిర్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు.
ఒకేసారి 22 విమానాలను నిలపడానికి 22ఎయిర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయనున్నారు. విమానాశ్రయం 3.5 కిమీ కంటే ఎక్కువ రన్‌వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ టవర్, కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ వింగ్‌లను కలిగి ఉంటుంది.
వైజాగ్ నగరానికి 50కిలోమీటర్ల దూరంలో విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో విమానాశ్రయం నిర్మాణానికి 2200 ఎకరాల భారీ భూమిని సేకరించారు.
రాష్ట్ర ప్రభుత్వం భీమిలి నుంచి భోగాపురం వరకు 20 కిలోమీటర్ల దూరంలో 6 లేన్ల బీచ్ కారిడార్ రహదారిని అభివృద్ధి చేస్తోంది.