Page Loader
మొజాంబిక్‌లో 'మేడ్ ఇన్ ఇండియా' రైలులో ప్రయాణించిన జైశంకర్ 
మొజాంబిక్‌లో 'మేడ్ ఇన్ ఇండియా' రైలులో ప్రయాణించిన జైశంకర్

మొజాంబిక్‌లో 'మేడ్ ఇన్ ఇండియా' రైలులో ప్రయాణించిన జైశంకర్ 

వ్రాసిన వారు Stalin
Apr 14, 2023
02:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆఫ్రికన్ దేశం మొజాంబిక్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మొజాంబిక్‌లో 'మేడ్ ఇన్ ఇండియా' రైలులో ప్రయాణించారు. రైలు నెట్‌వర్క్‌ల ఎలక్ట్రిక్ మొబిలిటీ, వాటర్‌వేస్ కనెక్టివిటీని విస్తరించడంలో భారతదేశ భాగస్వామ్యం గురించి మొజాంబిక్ రవాణా మంత్రితో చర్చించారు. అలాగే ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి మొజాంబిక్ పార్లమెంటు అధ్యక్షుడిని కలిశారు. భారతదేశానికి చెందిన ఓ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఈస్ట్ ఆఫ్రికా దేశం మొజాంబిక్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఆఫ్రికా

ప్రవాస భారతీయులతో సమావేశమైన జైశంకర్

మొజాంబికన్ రవాణా, కమ్యూనికేషన్ మంత్రి, మొజాంబికన్ పోర్ట్ & రైల్ అథారిటీ ఛైర్మన్ మేటియస్ మగతో మాట్లాడినట్లు జైశంకర్ ట్వీట్ చేశారు. రైలు నెట్‌వర్క్‌లు, ఎలక్ట్రిక్ మొబిలిటీ, జలమార్గాల కనెక్టివిటీని విస్తరించడం పరస్పరం చర్చించుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో భారతదేశం నమ్మదగిన భాగస్వామి అని ఆయన ట్వీట్ చేశారు. అలాగే జైశంకర్ మొజాంబికన్‌లోని ప్రవాసులతో కూడా మాట్లాడారు. అనంతరం అక్కడ ఉన్న హిందూ ఆలయాన్ని సందర్భించారు. మాపుటోలోని శ్రీ విశ్వంభర్ మహాదేవ్ మందిర్‌లో జైశంకర్ ప్రార్థనలు చేశారు. అక్కడి భారతీయ సమాజంతో సంభాషించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన ట్వీట్