Page Loader
జమ్ముకశ్మీర్: పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు
జమ్ముకశ్మీర్: పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్: పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు

వ్రాసిన వారు Stalin
Apr 05, 2023
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలోని ఓ వైన్‌షాప్‌లో బాంబు పేలుడుకు పాల్పడిన ఇద్దరు లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) ఉగ్రవాదులు తప్పించుకున్నారు. సినీ ఫక్కీలో బుధవారం ఉదయం పోలీసుల అదుపులో నుంచి బయటపడ్డారు. మరూఫ్ నజీర్ సోలెహ్, షాహిద్ షోకత్ బాలా అనే ఇద్దరు ఉగ్రవాదులు మే 2022 నుంచి పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిద్దరూ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అనుకూలంగా పని చేశారు.

జమ్ముకశ్మీర్

ఉగ్రవాదుల కోసం పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

తప్పించుకున్న ఇద్దరు మిలిటెంట్లను పట్టుకోవడానికి బారాముల్లా, ఉత్తర కాశ్మీర్‌లోని ఇతర ప్రాంతాలలో పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. బారాముల్లా పోలీస్ స్టేషన్‌లో కస్టడీలో ఉన్న ఇద్దరు నిందితులు ఈ తెల్లవారుజామున తప్పించుకున్నారని పోలీసు అధికారి ఒకరు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. ఈ మేరకు తప్పించుకున్న ఉగ్రవాదులపై సంబంధిత సెక్షన్ల కింద ఇప్పటకే కేసు నమోదు చేశారు.