Page Loader
Encounter: జమ్మూ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదిని హతమార్చి వీరమరణం పొందిన కానిస్టేబుల్‌
జమ్మూ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదిని హతమార్చి వీరమరణం పొందిన కానిస్టేబుల్‌

Encounter: జమ్మూ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదిని హతమార్చి వీరమరణం పొందిన కానిస్టేబుల్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2024
05:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. శనివారం ఈ ఆపరేషన్‌లో ఓ కానిస్టేబుల్ చనిపోగా, డీఎస్పీ, ఏఎస్‌ఐకి గాయాలయ్యాయి. జమ్మూ కశ్మీర్ పోలీసులు ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. హెడ్‌ కానిస్టేబుల్‌ హెచ్‌సీ బషీర్‌ మృతి పట్ల జమ్మూ కశ్మీర్‌ డీజీపీ ఆర్‌ఆర్‌ స్వైన్‌ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. బషీర్ స్వయంగా విదేశీ ఉగ్రవాదిని తన ఆయుధంతో హతమార్చిన వీరుడు అని కొనియాడారు.

Details

ప్రతీకారం తీర్చుకుంటాం : డీజీపీ

అతని త్యాగాన్ని ఎప్పటికీ మరచిపోలేమని పేర్కొన్నారు. తమ సైనికుడిని కోల్పోయినప్పటికీ, ఆయన కుటుంబానికి అన్ని విధాలా సాయం అందిస్తామని డీజీపీ స్వైన్ తెలిపారు. బషీర్ చేసిన సేవలను స్మరించుకుంటూ, ఈ చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.