Avalanche: భారీ హిమపాతంతో నిండిపోయిన జమ్ము.. వైరల్ అవుతున్న వీడియో
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని సోన్‌మార్గ్‌లో బుధవారం భారీ హిమపాతం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే ఈ హిమపాతం కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
భారీ ఎత్తున మంచు కదులుతున్న దృశ్యాలను చూసిన వెంటనే స్థానికులు అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Details
ఉత్తరాఖండ్‌లోనూ హిమపాతం - 8 మంది మృతి
ఇటీవల ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లాలో మనా గ్రామం వద్ద కూడా భారీ హిమపాతం సంభవించింది.
అక్కడ పనులు చేస్తున్న కార్మికుల్లో 55 మంది మంచు కింద చిక్కుకుపోయారు.
వారిలో 47 మందిని సురక్షితంగా రక్షించగా, ఎనిమిది మంది హిమచరియల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
Details
అవలాంచ్ అంటే ఏమిటి?
ప్రతేడాది శీతాకాలంలో హిమాలయ ప్రాంతాల్లో మంచు చరియలు విరిగి పడుతూ ఉంటాయి. ఇవి కేవలం 5 సెకన్ల వ్యవధిలో గంటకు 80 మైళ్ల వేగంతో కిందకు జారుకుంటాయి.
ఇలాంటి అవలాంచ్ ఘటనల్లో 2.3 లక్షల ఘన మీటర్ల వరకు మంచు విడుదలవుతుంది.
దీని అర్థం 20 ఫుట్‌బాల్ మైదానాలను 3 మీటర్ల మందం వరకూ కప్పేంత మంచు ఒక్కసారిగా పడిపోవడం. ఈ ప్రక్రియను 'అవలాంచ్' అంటారు.